దేశంలో కొత్త అలజడి.. బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందిలో కరోనా

దేశంలో మరోసారి కరోనా అలజడి మొదలైంది. బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. బ్రిటన్ లో అన్నీ దేశాలు రాకపోకలు బంద్ చేశాయి. కొత్తగా మారి వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తున్న ఈ వైరస్ భయం ఇప్పుడు భారతదేశంలోనూ నెలకొంది. దేశంలో కొత్త అలజడి రేకెత్తుతోంది. Also Read: ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆటకట్టించిన పోలీసులు బ్రిటన్ నుంచి ఇండియాకు వస్తున్న ప్రయాణికుల్లో 20మందికి కోవిడ్ పాజిటివ్ […]

Written By: NARESH, Updated On : December 23, 2020 9:47 am
Follow us on

దేశంలో మరోసారి కరోనా అలజడి మొదలైంది. బ్రిటన్ లో రూపాంతరం చెందిన కొత్త కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. బ్రిటన్ లో అన్నీ దేశాలు రాకపోకలు బంద్ చేశాయి. కొత్తగా మారి వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తున్న ఈ వైరస్ భయం ఇప్పుడు భారతదేశంలోనూ నెలకొంది. దేశంలో కొత్త అలజడి రేకెత్తుతోంది.

Also Read: ఆన్ లైన్ లోన్ యాప్ ల ఆటకట్టించిన పోలీసులు

బ్రిటన్ నుంచి ఇండియాకు వస్తున్న ప్రయాణికుల్లో 20మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. బ్రిటన్ నుంచి వివిధ విమానాశ్రయాల్లో దిగుతున్న వీరికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.

కానీ ఇండియాలో ఇప్పటివరకు కొత్త స్ట్రెయిన్ కనబడలేదని డాక్టర్లు, నిపుణులు స్పష్టం చేస్తున్నాయి. కానీ యూకే నుంచి సోమ, మంగళవారాల్లో ఇండియాలోని వివిధ విమానాశ్రయాల్లో దిగిన 20మందికి పరీక్షలు నిర్వహించగా 20మంది ప్రయాణికుల్లో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. వీరంతా లండన్ నుంచి ఎయిరిండియా విమానాల్లో దేశంలో దిగినవారే కావడం గమనార్హం.

Also Read: పార్టీ మారిన బీజేపీ ఎంపీ భార్య.. విడాకులిచ్చిన భర్త

ముందు జాగ్రత్త చర్యగా అన్ని వివరాలు సేకరిస్తున్నామని నీతి అయోగ్ డైరెక్టర్ వీకే పాల్ తెలిపారు. వ్యాక్సిన్ డెవలప్ మెంట్ లో కొత్త వైరస్ ప్రభావం ఉండదని తెలిపారు. యూకేలో తలెత్తిన ఈ వైరస్ కారణంగా ఫాటలిటీ మరణాలు లేవని.. ఆందోళన చెందవద్దని కేంద్రం తెలిపింది.

ఇక లండన్ నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. 14 రోజుల పాటు తప్పక క్వారంటైన్ లో ఉండాల్సిందేనని అంటున్నారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు