
ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. మాంసం ముద్దలు విసురుకుడు.. ఇదేదో రోడ్డుపై చేస్తున్నఆందోళన కాదు. తైవాన్ పార్లమెంట్ లో ప్రజాప్రతినిధుల కొట్లాట. అమెరికా నుంచి ఫొర్క్, భీప్ మాంసం దిగుమతిపై తైవాన్ పార్లమెంట్ లో చర్చ జరిగింది. ఈ అంశంపై సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకున్నారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం తరువాత ఫోర్క్ మాంసం దిగుమతిపై నిషేధం ఎత్తివేసింది. దీంతో సభ్యలు తమ బ్యాగుల్లో మాంసం ముద్దలు తీసుకొచ్చి గందరగోళం స్రుష్టించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా నిషేధం ఎత్తివేయడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.