Passion for America:అగ్రరాజ్యం అమెరికా.. గతేడాది వరకు యువకు ఓ డ్రీమ్. అక్కడికి వెళ్లి చదువుకోవాలి.. అక్కడే ఉద్యోగం చేయాలి.. అక్కడే స్థిరపడాలి అనిభావించేవారు. ఎందుకంటే సంపన్న దేశం. మన కరెన్సీతో పోలిస్తే డాలర్ విలువ ఎక్కువ. ఇక ప్రశాంతమైన దేశం. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక అగ్రరాజ్యం పాలన పిచ్చోడిచేతిలో రాయిలా మారింది. దీంతో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కావడం లేదు. మరోవైపు విదేశీయులను అమెరికా నుంచి పంపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా భారతీయ విద్యార్థులు, యువతలో అమెరికా కల కరిగిపోతోంది.
Also Read: గంటకు 1000 కి.మీలు.. విమానం కంటే స్పీడు.. ఆ రైలును సృష్టించిన చైనా.. ప్రపంచమే అవాక్కు
33 శాతం తగ్గిన వీసాలు..
భారత విద్యార్థులు అమెరికాకు వెళ్లే ధోరణి 2024లో 33% తగ్గింది, ఎఫ్–1 వీసాలు 89 వేలు జారీ చేయగా, అది 59 వేలకు పడిపోయింది. సోషల్ మీడియా వెట్టింగ్, కఠిన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, ట్రంప్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై ఆంక్షలు ఈ తగ్గుదలకు కారణం. దీంతో అమెరికా తన బెస్ట్ ఉన్నవిద్య ఇమేజ్‌ను సొంతంగా చెడగొట్టుకుంటోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కొత్త ఆంక్షలతో ఆలోచనలో పడుతున్నారు.
ప్రత్యామ్నాయంవైపు చూపు..
అమెరికా ఆంక్షలు, అధిక ఖర్చుల మధ్య భారత విద్యార్థులు కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, యూకే వైపు మొగ్గు చూపుతున్నారు. కెనడాలో 15%, జర్మనీలో 20% భారతీయ విద్యార్థుల పెరుగుదల నమోదైంది. తక్కువ ట్యూషన్ ఫీజులు, మెరుగైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా అవకాశాలు, స్నేహపూర్వక ఇమ్మిగ్రేషన్ విధానాలు ఈ దేశాలను ఆకర్షణీయంగా మార్చాయి. దీంతో అమెరికా తన ‘‘గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్’’ ట్యాగ్‌కు ముప్పు తప్పేలా లేదు.
Also Read: చనిపోయే ముందు తిమింగలాలు మీదికి వచ్చి ఆ పని చేస్తాయి… వాటి గురించి షాకింగ్ నిజాలు
అమెరికా డ్రీమ్‌కు ఎదురు గాలి..
అమెరికాలో ట్యూషన్ ఫీజులు (వార్షికంగా 30 వేల డాలర్ల నుంచి 60 వేల డాలర్లు), జీవన వ్యయం (15 వేల డాలర్ల నుంచి రూ.20 వేల డాలర్లు), బీమా ఖర్చులు భారతీయ విద్యార్థులకు ఆర్థిక భారంగా మారాయి. రూపాయి విలువ తగ్గుదల ఈ భారాన్ని మరింత పెంచింది. హెచ్–1బీ వీసా ప్రక్రియలో మార్పులు, డీపోర్టేషన్ భయాలు, ఉద్యోగ అవకాశాలపై అనిశ్చితి విద్యార్థులలో అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. దీంతో అమెరికా ‘‘అవకాశాల భూమి’’గా కాకుండా ‘‘ఆంక్షల భూమి’’గా మారుతోంది.