Homeబిజినెస్TVS iQube electric scooter benefits: పెట్రోల్ బైక్ కంటే ఈ స్కూటర్ చాలా బెటరట.....

TVS iQube electric scooter benefits: పెట్రోల్ బైక్ కంటే ఈ స్కూటర్ చాలా బెటరట.. ఎందుకంటే?

TVS iQube electric scooter benefits: కాలం మారుతున్న కొద్దీ ఎలక్ట్రిక్ స్కూటర్ల పై మోజు పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో పాటు వాతావరణ కాలుష్యం నుంచి బయటపడడానికి విద్యుత్ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇవి ధర అందుబాటులో ఉండడమే కాకుండా మైలేజ్ విషయంలో కూడా వినియోగదారులకు సపోర్టుగా ఉంటున్నాయి అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల EV టూ వీలర్స్ మార్కెట్లోకి వచ్చాయి. కానీ కొన్నింటికే ఆదరణ లభిస్తుంది. వినియోగదారులు ఈ స్కూటర్ల కొనుగోలు సమయంలో ధర విషయంలో కేర్ తీసుకుంటున్నట్లు తెలవడంతో కొన్ని కంపెనీలు బడ్జెట్ లోనే వీటిని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా వీటి మైలేజ్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాంటి కంపెనీలో TVS ఒకటి. దీని నుంచి మార్కెట్లోకి వచ్చిన IQube ఎలక్ట్రిక్ స్కూటర్ అలరిస్తోంది. ఇందులో ఉండే ఫీచర్స్ మరింత ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

TVS iQube స్కూటర్ పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్. ఇందులో 3.4 kWh నుంచి 3.5 KWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 145 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ వెర్షన్ లో టాప్ ఎండ్ స్కూటర్ అయినా ఐ క్యూబ్ ST లో 5.1 KWh బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. దీంతో నగరాల్లో, పట్టణాల్లో మాత్రమే కాకుండా దూర ప్రయాణాలు చేయడానికి కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ బ్యాటరీ చార్జింగ్ లో భాగంగా 2.2 kWh చార్జింగ్ పూర్తి కావడానికి రెండు గంటల 45 నిమిషాలు పడుతుంది. 5.1 kWh బ్యాటరీ చార్జింగ్ కోసం నాలుగు గంటల 18 నిమిషాల సమయం తీసుకుంటుంది.

ఈ స్కూటర్లో నేటితరం వారు ఆకట్టుకునే విధంగా స్మార్ట్ టెక్నాలజీని అమర్చారు. ఇందులో సెవెన్ అంగుళాల TTF ఉండనుంది. ఇది బిగ్ స్క్రీన్ తో ఉండటం వల్ల అన్ని వివరాలు క్లియర్ గా కనిపిస్తాయి. అంతేకాకుండా దీనికి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ కావడంతో నావిగేషన్, రిమోట్ లాకింగ్, బ్యాటరీ స్టేటస్ వంటివి క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ స్కూటర్ డిజైన్ చూడడానికి ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. దీనికి ఎల్ఈడి హెడ్ లైట్స్, యాంటీ తెఫ్టు అలారం, డిస్క్ బ్రేక్ వంటివి ఉన్నాయి. అలాగే మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ ఛార్జింగ్ పోస్ట్ కూడా ఉంటుంది.

ఈ స్కూటర్ ప్రస్తుతం అందుబాటులో 12 రంగుల్లో లభిస్తుంది. రంగును బట్టి ధర మారుతుంది. దీనిని టెక్స్ షోరూం వద్ద రూ.96,442 ధరతో విక్రయిస్తున్నారు. అదనపు ఫీచర్స్, ప్రత్యేక సదుపాయాలతో రూ.1.63 లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉంది ఇక ఈ స్కూటర్ ను Battery As a Service ద్వారా కొనుగోలు చేస్తే రూ.59,999 కే సొంతం చేసుకోవచ్చు. పెట్రోల్ వాహనాల కంటే ఈ స్కూటర్ ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటుందని కొంతమంది కొనియాడుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper