Homeక్రీడలుక్రికెట్‌Shoaib Akhtar praises Team India: పాకీ గాళ్ళు టీమిండియాను పొగుడుతుంటే ఆ కిక్కే వేరప్ప!

Shoaib Akhtar praises Team India: పాకీ గాళ్ళు టీమిండియాను పొగుడుతుంటే ఆ కిక్కే వేరప్ప!

Shoaib Akhtar praises Team India: టీమిండియా మీద నిత్యం పాకిస్తాన్ క్రికెటర్లు.. మాజీ క్రికెటర్లు బురద చిమ్ముతూనే ఉంటారు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ విద్వేషాన్ని రగిలిస్తూనే ఉంటారు. టీమిండియా సాధించిన విజయాలను మరో కోణంలో చూస్తూ.. వక్ర భాష్యాలను చెబుతూ ఉంటారు.

తొలిసారిగా టీం ఇండియాను ఓ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ పొగిడాడు. టీమిండియా సాధించిన విజయాన్ని ఆకాశానికి ఎత్తాడు.. టీమ్ ఇండియా మేనేజ్మెంట్.. కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహరించిన తీరు జట్టు విజయానికి దోహదం చేశాయని పేర్కొన్నాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చర్చకు దారితీస్తున్నాయి. అతడు టీం ఇండియా ప్లేయర్లను.. మేనేజ్మెంట్ వ్యవహరించిన తీరును.. కోచ్ రూపొందించిన ప్రణాళికలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇంతకీ ఆ క్రికెటర్ మరెవరో కాదు.. ఒకప్పుడు వేగవంతమైన బౌలింగ్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షోయబ్ అక్తర్.

టీమిండియా అంటే చాలు షోయబ్ అక్తర్ మండిపడుతూ ఉంటాడు. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో అయితే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో షోయబ్ అక్తర్ తన మనసు మార్చుకున్నాడు. టీమిండియా ఆడిన తీరును కొనియాడాడు.. “టీమిండియా విధానం బాగుంది. వారు అనుసరించిన ప్రణాళికలు గొప్పగా ఉన్నాయి. సంజు శాంసన్ ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోవడానికి గౌతమ్ గంభీర్ చాలా మందితో ఫైట్ చేశాడు. రోహిత్, విరాట్ కోహ్లీ స్థానంలో యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చాడు. మాజీ కెప్టెన్లకు కూడా గౌరవం ఇచ్చాడు. అందువల్ల టీమిండియా ఈ స్థాయిలో విజయం సాధించిందని” షోయబ్ పేర్కొన్నాడు.

షోయబ్ మాట్లాడిన మాటలను టీమ్ ఇండియా అభిమానులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికైనా పాకిస్తాన్ క్రికెటర్లు.. మాజీ క్రికెటర్లు బుద్ధి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.. పాకిస్తాన్ ప్లేయర్లు సరైన విధానంలో పయనిస్తే మేము స్వాగతిస్తామని.. అలాకాకుండా భారత జట్టు మీద అడ్డగోలుగా విమర్శలు చేస్తే మేము కూడా అదే స్థాయిలో స్పందిస్తామని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular