Trump and Elon Musk Dinner: ప్రపంచ కుబేరుడు.. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంలో డోజ్ చైర్మన్‌గా పనిచేసిన ఎలాన్ మస్క్.. ఇటీవల ట్రంప్‌ను విభేదించి బయటకు వచ్చారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో ట్రంప్ తరఫున ప్రచారం చేశారు. ప్రభుత్వంలో కీలక పదవి దక్కించుకున్నారు. కానీ ఆర్థిక అంశాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను మస్క్ విభేదించారు. ఈ క్రమంలో పదవిని వదిలేశారు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ ట్రంప్–మస్క్ రహస్యంగా భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి గత శనివారం బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో డిన్నర్ చేశారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అరెస్టు చేసిన సైనిక చర్యకు మస్క్ అభినందాలు తెలిపిన కొన్ని గంటల తర్వాత ఈ సమావేశం జరిగింది. మస్క్ దీన్ని ప్రపంచవ్యాప్త గెలుపుగా, అనీతి పాలకులకు హెచ్చరికగా పేర్కొన్నారు.
ఎక్స్‌లో ఫోటో వైరల్..
మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌పాం ఎక్సలో ట్రంప్‌తో డిన్నర్ ఫొటోను పోస్ట్ చేసి, “@POTUS, @FLOTU తో గత రాత్రి చాలా ఆనందంగా భోజనం చేశాం. 2026 అద్భుతంగా ఉంటుంది‘ అని రాశారు. ఈ వైరల్ ఇమేజ్ రెండు నాయకుల మధ్య విభేదాలు తొలగిపోయినట్లు సూచిస్తోంది.
ఎన్నికల్లో మస్క్ మద్దతు
2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోరాటానికి మస్క్ ఆర్థిక, మాటల మద్దతు ఇచ్చి కీలక పాత్ర పోషించారు. 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలపై మస్క్ విమర్శలు చేసి బయటకు వచ్చారు. జూన్‌లో తీవ్ర గొడవలు జరిగాయి.
గత ఏడాది జూన్ తర్వాత మస్క్ రిపబ్లికన్ పార్టీ హౌస్, సెనెట్ పోరాటాలకు ధనసహాయం చేయడంతో సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ డిన్నర్ ఇందుకు నిదర్శనం. ఈ భేటీ రెండు వైపులా ఉత్సాహాన్ని పెంచుతోంది.