YS Jagan vs AP People: జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) వన్ ఛాన్స్ ఇచ్చారు ఏపీ ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం 100 ఛాన్సులు మిస్ చేసుకున్నారు. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని చెప్పి చాలా అంశాలను పక్కన పెట్టేశారు. అందులో భోగాపురం విమానాశ్రయం ఒకటి, రెండోది అమరావతి రాజధాని నిర్మాణం, మూడోది పోలవరం ప్రాజెక్ట్. అయితే వీటిని చంద్రబాబు ప్రారంభించారనో.. ఆయనకు క్రెడిట్ వెళ్ళిపోతుందనో.. లేకుంటే సంక్షేమ పథకాలకు నిధులు చాలవు అన్న కోణంలో ఆలోచన చేసి ఉండాలి. అయితే ఐదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఆ క్రెడిట్ ను దక్కించుకునేవారు. పోనీ వాటి గురించి టచ్ చేయకూడదు. సరిగ్గా 2024 ఎన్నికల కు ముందు టచ్ చేసి చంద్రబాబు చేసిన పని కరెక్ట్ అన్నట్టు ప్రజలకు సంకేతాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. దేనినైతే వ్యతిరేకించారో దానినే ఎన్నికలకు ముందు ప్రారంభించారు. తాను చేసింది తప్పు అని ఒప్పుకున్నారు.
మాటల్లో తప్పిదాలు..
రాజకీయాల్లో ఉన్నవారు.. అందునా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని పాలిస్తామనుకున్న వారు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మాట్లాడాలి. చిన్నపాటి తప్పిదం చేసినా దాని పర్యవసానాలు ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి దొరికిపోయారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను( bhogapuram International Airport ) వద్దన్నారు. అసలు ఎందుకు ఆ ఎయిర్పోర్ట్ అని ప్రశ్నించారు. అందరూ వ్యతిరేకించాలని సూచించారు. ఎలా కడతారో చూస్తాను అంటూ ప్రశ్నించారు. దీనిపై పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. తీరా 2024 ఎన్నికల కు ముందు ప్రజలకు చెప్పాలన్న రీతిలో అదే ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. అది తప్పు అని.. చంద్రబాబు చేసింది కరెక్ట్ ప్రజలకు తెలియ చెప్పారు. ఇలా తనకు ఛాన్స్ వచ్చినా వినియోగించుకోలేకపోయారు.
భోగాపురం, అమరావతి విషయంలో..
భోగాపురం ఎయిర్పోర్ట్ రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఉంది. ప్రజలు ఇచ్చిన వన్ ఛాన్స్ కు అదో అరుదైన అవకాశం కూడా. 2014లో అధికారంలో వచ్చిన చంద్రబాబు భోగాపురంలో ఎయిర్పోర్ట్ను ప్రతిపాదించారు. భూ సమీకరణ పూర్తి చేయగలిగారు. నష్టపరిహారం చెల్లింపును కొలిక్కి తెచ్చారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించారు. ఇన్ని చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వన్ ఛాన్స్ కూడా తీసుకోలేదు. పైగా తాను వ్యతిరేకించిన అదే భోగాపురం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలా వన్ ఛాన్స్ కు బదులు తీర్చుకున్నారు. పోనీ అమరావతి రాజధానిని పూర్తిచేసి ఆ వన్ ఛాన్స్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా అంటే అది లేదు. అక్కడ కూడా చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని భావించారు. అయితే అప్పటికే భూ సమీకరణ పూర్తి చేశారు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి ఉన్నారు. కొన్ని నిర్మాణాలు కూడా మొదలయ్యాయి. ఇటువంటి సమయంలో ఆ వన్ ఛాన్స్ ను కూడా వినియోగించుకోలేకపోయారు జగన్. ఎంతవరకు సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా అని ప్రజలు ఆల్ ఈజ్ వెల్ అని భావించినట్టు నిర్ణయానికి వచ్చారు. కానీ ప్రజలు అన్ని విషయాలను గమనించి పక్కన పెట్టేశారు. నో మోర్ ఛాన్స్ అని తేల్చేశారు.