https://oktelugu.com/

క్రోయేషియాలో భారీ భూకంపం:పలువురి మృతి

  క్రోయేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైంది. జాగ్రెబ్ కు 46 కిలోమీటర్ల దూరంల్ భూకంపం కేంద్రీక్రుతమైనట్లు గుర్తించామని యూరోపియన్ మెడిటేరేనన్ సెస్మలాజికల్ సెంటర్ వెల్లడించింది. కాగా మొన్న సోమవారం కూడా ఇక్కడ భూకంపం వచ్చింది. మంగళవారం మరోసారి భూకంపం రావడంతో క్రోయేసియా అల్లకల్లోలమైంది. కాగా ఈ భూకంప తీవ్రతతో ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. పలు చోట్ల భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద ఉన్న […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 30, 2020 / 08:56 AM IST
    Follow us on

     

    క్రోయేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైంది. జాగ్రెబ్ కు 46 కిలోమీటర్ల దూరంల్ భూకంపం కేంద్రీక్రుతమైనట్లు గుర్తించామని యూరోపియన్ మెడిటేరేనన్ సెస్మలాజికల్ సెంటర్ వెల్లడించింది. కాగా మొన్న సోమవారం కూడా ఇక్కడ భూకంపం వచ్చింది. మంగళవారం మరోసారి భూకంపం రావడంతో క్రోయేసియా అల్లకల్లోలమైంది. కాగా ఈ భూకంప తీవ్రతతో ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. పలు చోట్ల భవనాలు కూలిపోవడంతో శిథిలాల కింద ఉన్న వారిని బయటికి తీస్తున్నారు. మ్రుతల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా ఇటీవల భూప్రకంపణలు పలు దేశాలను వణికిస్తున్నాయి. గత అక్టోబర్ లో టర్కీలో వచ్చిన భూకంపంతో వందలాది మంది చనిపోయారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది.