https://oktelugu.com/

టిపిసిసి చీఫ్ ఎంపికపై హైడ్రామా!

తెలంగాణకు కొత్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) చీఫ్ నియామకంపై హైడ్రామా కొనసాగుతోంది. రేపో మాపో ప్రకటిస్తారని అందరూ ఊహించినా ఆ ఊహాగానాలకు అంతం లేకుండా పోతోంది. పీసీసీ చీఫ్ నియామకానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దాదాపు 200 మంది పార్టీ కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా తన సిఫారసులతో ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మణికం ఠాగూర్ హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు. కానీ ఇప్పటికీ ఢిల్లీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2020 / 08:57 AM IST
    Follow us on

    తెలంగాణకు కొత్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) చీఫ్ నియామకంపై హైడ్రామా కొనసాగుతోంది. రేపో మాపో ప్రకటిస్తారని అందరూ ఊహించినా ఆ ఊహాగానాలకు అంతం లేకుండా పోతోంది. పీసీసీ చీఫ్ నియామకానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

    దాదాపు 200 మంది పార్టీ కార్యకర్తల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా తన సిఫారసులతో ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మణికం ఠాగూర్ హైకమాండ్‌కు నివేదిక సమర్పించారు. కానీ ఇప్పటికీ ఢిల్లీ అధిష్టానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

    నివేదికలను పరిశీలించిన హైకమాండ్.. మరికొందరు నాయకుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఎక్కువ మంది నాయకులను ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం. వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటోంది. సోమవారం సీనియర్ శాసన మండలి సభ్యుడు టి జీవన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచారు. ఎ.ఐ.సి.సి నాయకుడు, మాజీ ఎంపీ మధు యష్కీతో కూడా హైకమాండ్ భేటి అయ్యి వారి అభిప్రాయాలు తీసుకుంటారు.

    నివేదికల ప్రకారం.. పిసిసి చీఫ్ పదవిని మళ్ళీ ఒక రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతకే ఇవ్వాలని తాత్కాలికంగా నిర్ణయించారు. జీవన్ రెడ్డి కూడా రేసులో ఉన్నప్పటికీ, ఈ పదవిపై తనకు ఆసక్తి లేదని పార్టీకి చెప్పినట్టు సమాచారం.. అయినప్పటికీ, త్వరగా నిర్ణయం తీసుకోమని అతను చెప్పాడు.

    సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి పేరు కూడా చర్చకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అతని పేరును సూచించారని సమచారం, ఎందుకంటే శశిధర్ రెడ్డి హైకమాండ్ కు.. సీనియర్లకు విధేయుడిగా ఉన్నారు.

    మరో సీనియర్ నాయకుడు కె. జనా రెడ్డికి కూడా న్యూ ఢిల్లీ నుండి కాల్ వచ్చింది, పిసిసి చీఫ్ పోస్టుకు అతని పేరు కూడా పరిగణించబడుతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ నివేదికలన్నీ పార్టీలో అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. హైకమాండ్ ఈ సమస్యను మరికొంత కాలం సాగదీస్తోందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.