https://oktelugu.com/

వినాయకుడికి నెయ్యి తో కలిపిన సింధూరం దిద్దితే ఏమవుతుందో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ శుభ కార్యం చేసే ముందు ఆ విగ్నేశ్వరునికి పూజ నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా వారంలో బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు. ఈ బుధవారం వినాయకుడికి ప్రత్యేకమైన పూజలను చేస్తారు. మనం చేసే కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే ముందుగా ఆ వినాయకుడికి పూజ నిర్వహించాల్సిందే. అందుకే వినాయకుడిని ప్రథమ పూజ్యుడు అని కూడా పిలుస్తారు. Also Read: గృహప్రవేశం రోజు ముందుగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2020 / 08:54 AM IST
    Follow us on

    మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ శుభ కార్యం చేసే ముందు ఆ విగ్నేశ్వరునికి పూజ నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా వారంలో బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు. ఈ బుధవారం వినాయకుడికి ప్రత్యేకమైన పూజలను చేస్తారు. మనం చేసే కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలంటే ముందుగా ఆ వినాయకుడికి పూజ నిర్వహించాల్సిందే. అందుకే వినాయకుడిని ప్రథమ పూజ్యుడు అని కూడా పిలుస్తారు.

    Also Read: గృహప్రవేశం రోజు ముందుగా గోవుతో గృహప్రవేశం ఎందుకు చేస్తారు తెలుసా?

    వినాయకుడికి పూజ చేసే సమయంలో ఆవు నెయ్యితో కలిపిన సింధూరాన్ని పెట్టి పూజ చేయటం వల్ల మన అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతే కాకుండా వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక, మోదకాలు సమర్పించడంతో స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. స్వామివారికి ఐదు గరిక పోచులను సమర్పించి పూజ చేసిన అనంతరం బెల్లంతో చేసిన నైవేద్యం సమర్పించి, శ్రీ గణేష్ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అంతేకాకుండా స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని ఆవుకు పెట్టడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయి.

    Also Read: సాయంత్ర సమయంలో తలుపులు మూసి ఉంచకూడదో తెలుసా?

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ వినాయకుని కేతువుగా భావిస్తారు. అందుకోసమే ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా వినాయకుడికి మొదటగా పూజలను నిర్వహిస్తారు. ఇంతటి మహిమగల వినాయకుని మన ఇంటి సింహ ద్వారం ముందు ప్రతిష్టించడం వల్ల ఎటువంటి నరదృష్టి కూడా మన ఇంటిపై పడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా మన ఇంటిలో ఏర్పడే ప్రతికూల వాతావరణాన్ని తొలగించి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం