Homeఇంటర్నేషనల్Crime To Wear Clothes: ఆ టౌన్ లో బ‌ట్ట‌లు వేసుకోవ‌డం నేరం.. న‌గ్నంగానే ఉంటారు..

Crime To Wear Clothes: ఆ టౌన్ లో బ‌ట్ట‌లు వేసుకోవ‌డం నేరం.. న‌గ్నంగానే ఉంటారు..

Crime To Wear Clothes: కొన్ని దేశాల్లో చాలా రకాల వింత ఆచారాలు ఉంటాయి. అలాగే ఒకానొక దేశంలో పూర్తి నగ్నంగా జీవిస్తారు. అది ఏ దేశమని అంతా ఆలోచిస్తున్నారా. ఎంతో అభివృద్ధి చెందిన ఫ్రాన్స్ దేశంలోని కేప్డీ ఆగ్డే అనే పట్టణం. ఈ పట్టణంలో ప్రతి ఒక్కరూ బట్టలు లేకుండా తిరగడం ఆనవాయితీ. ఇది ప్రపంచంలోని అతి పెద్ద నగ్న నగరం. బీచుల్లో, వీధుల్లో, షాపింగ్ మాల్స్ లో కూడా ఇలానే నగ్నంగా తిరుగుతారు.

Crime To Wear Clothes
Crime To Wear Clothes

ఇది చూసిన ఇక్కడి వచ్చిన టూరిస్టులు చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటూ ఉంటారు. ఇక్కడి వచ్చిన టూరిస్టులను కూడా బట్టలు తీసేయమని అక్కడి వారు చెబుతూ ఉంటారు. ఇలా ఇక్కడి వారు నగ్నంగా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది. ప్రకృతి దగ్గరగా ఉండడం కోసమే ఈ దేశం వారు అలా ఉంటామని చెబుతున్నారు.

ఈ వింత ఆచారాన్ని చూసి చాలా మంది షాక్ అవుతూ ఉంటారు. ఈ 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి వింత ఆచారాలు ఏంటని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా చేయడం వారు తమకు తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు. ఈ ఆచారాన్ని వారు పాటించడం మాత్రమే కాకుండా ఆ నగరానికి ఎవరైనా టూరిస్టులు వచ్చినా కూడా వారితో బలవంతంగా పాటింపజేస్తున్నారు.

ఈ ఆచారం ఏదో మారుమూల దేశంలో రాజ్యమేలుతోందంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఈ ఆచారం ఉన్నది ఎంతో డెవలప్ అయిన ఫ్రాన్స్ లాంటి పాశ్చాత్య దేశంలో. అక్కడ ఈ ఆచారం ఇంత స్ట్రాంగ్ గా ఉండేందుకు అక్కడి చట్టాలు కూడా ఈ ఆచారాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అందువల్లే ఈ ఆచారం చాలా బలంగా అక్కడ పాతుకుపోయింది.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version