
గణతంత్ర దినోత్సవానికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత నెల 27న ప్రధాని నరేంద్ర మోదీ జాన్సన్ కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో మోదీ ఆయనను ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో యూకేలో వచ్చే ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు రావాల్సిందిగా మోదీని బోరిస్ జాన్సన్ ఆహ్వానించినట్లు తెలిపాయి.