
గత కొంతకాలంగా ప్రేక్షకులు లేకుండానే మ్యాచులు జరుగుతున్నాయి. అయితే కరోనా క్రైసిస్ లోనూ ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడి ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది. చాలాకాలం తర్వాత ప్రేక్షకుల మధ్య జరుగుతున్న మ్యాచులో భారత్ ఎట్టకేలకు బోణి కొట్టింది. ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు మ్యాచులు ఆడుతున్న భారత్ ఇప్పటికే రెండు మ్యాచులు ఓడిపోయింది.
Also Read: కోహ్లీ నుంచి రోహిత్ కు కెప్టెన్సీ పగ్గాలు దక్కేనా?
తాజాగా జరిగిన మూడో వన్డేలో భారత్ ఆస్ట్రేలియాపై 13పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వన్డే సిరీసును ఆస్ట్రేలియా 2-1తేడాతో కైవసం చేసుకుంది. గత రెండు మ్యాచుల్లోనూ భారత్ పేలవమైన ప్రదర్శన చేయడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు విన్పించాయి.
ఈక్రమంలోనే మూడో వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగు మార్పులతో బరిలో దిగాడు. బౌలర్లలో షమీ.. సైనీ..చాహెల్ ను పక్కనపెట్టి శార్దూల్ ఠాకూర్.. నటరాజన్.. కుల్దీప్ యాదవ్ లకు అవకాశం ఇచ్చాడు. ఓపెనర్ గా శుభ్ మన్ గిల్ కు అవకాశం దక్కింది. ఇక రెండు మ్యాచులకు భిన్నంగా కోహ్లి టాస్ కలిసొచ్చింది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ దిగింది.
Also Read: టీమిండియా ఓటమికి కారణమేంటి?
టీం ఇండియా తొలుత బ్యాటింగ్ లో తడబడిన చివర్లో పాండ్యా.. జడేజాలు రాణించడంతో స్కోరు 300లు దాటింది. ఫుల్ ఫామ్ లో ఆస్ట్రేలియా ఈ స్కోరును ఈజీగా దాటేస్తుందని అందరూ భావించారు. అయితే భారత బౌలర్లలో నటరాజన్.. బుమ్రా చక్కగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా తడబడింది.
దీంతో ఆస్ట్రేలియాను భారత్ తొలిసారి ఆలౌట్ చేసింది. మొత్తానికి భారత్ 13పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈనెల 4నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ట్వీ-20కి ముందు ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించడంతో టీంఇండియాలో కొత్త ఉత్సాహం కనబడుతోంది. అయితే టీ-20 సీరీస్ గెలుచుకొని భారత్ సత్తా చాటుతుందో లేదో వేచిచూడాల్సిందే..!