Indian treasures abroad: మన దేశాన్ని తెల్ల దొరలు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. మనదేశంలో ఉన్న రాజుల మధ్య విభేదాలను సృష్టించి వినోదం చూశారు. దేశ ప్రజలను హింసించి ఆనందం వ్యక్తం చేశారు. విలువైన వనరులు మొత్తం తమ దేశానికి తరలించారు. తద్వారా మన దేశాన్ని సర్వనాశనం చేశారు. వజ్రాల నుంచి మొదలుపెడితే కలప వరకు ప్రతిదీ తీసుకెళ్లారు.. నాడు ఆంగ్లేయులు విలువైన వనరులు మొత్తం తమ దేశానికి తీసుకెళ్లి సుసంపన్నం చేసుకున్నారు. ఇష్టానుసారంగా దోచుకుని దాచుకున్నారు. అయినప్పటికీ భారత్ తన కష్టాన్ని నమ్ముకుంది. ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇంగ్లాండ్ భారత్ కంటే వెనకే ఉంది.
Also Read: మొక్కజొన్న కంకులను ఇలా ఒలుస్తారా? భయ్యా నీIndiaVsUKకు కచ్చితంగా నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే..
ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం వెలుగులోకి వచ్చింది. లండన్ నగరంలో ఉన్న వీధులలో అతిపెద్ద మాలిగల కింద ఈ బంగారాన్ని నిలువ చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ బంగారం నిల్వల విలువ 4 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.400, 000 బంగారు బార్ లు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ భూగర్భ ఖజానాలో అత్యంత సురక్షితంగా నిల్వచేశారు. బాంబు దాడులను తట్టుకునే విధంగా తలుపులను, అధునాతన వాయిస్ రికగ్నైజేషన్ లాక్ లతో ఇక జానా అత్యంత సురక్షితంగా ఉంది. ఇందులో ఫోర్ట్ మార్క్స్ కంటే ఎక్కువ బంగారం నిల్వ ఉందని తెలుస్తోంది. ఇందులో ఉన్న బంగారం న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ తర్వాతి స్థానంలో ఉంది. ప్రతి బంగారం బార్ బరువు 12.4 కిలోలు.. బంగారం బార్ లను అత్యంత జాగ్రత్తగా పేర్చారు. అయితే ఇంత బంగారం ఇంగ్లాండ్ ప్రభుత్వానిది కాదు. ఈ బంగారం మొత్తం విదేశీ ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలకు చెందినది. రెండవ ప్రపంచ యుద్ధం నుంచి ఇది యూరప్ ప్రాంతానికి చెందిన బంగారాన్ని కాపాడింది. అప్పటినుంచి లండన్ లోని థ్రెడ్ నీడిల్ స్ట్రీట్ ప్రాంతంలో ఈ బంగారాన్ని భద్రంగా ఉంచుతున్నారు. ప్రపంచ ఆర్థిక నమ్మకానికి అత్యంత శక్తివంతమైన చిహ్నంగా ఇక్కడ బంగారాన్ని నిల్వ చేస్తున్నారు.
ఇంత మొత్తంలో బంగారం నిల్వ ఉన్నట్టు వార్తలు రావడంతో అదంతా భారతదేశానికి చెందినదేనని వార్తలు వచ్చాయి. కానీ ఆ బంగారంతో మన దేశానికి సంబంధం లేదు. ఎందుకంటే మన దేశం నుంచి కేవలం రా మెటీరియల్ మాత్రమే ఆంగ్ల పరిపాలకులు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంగ్లాండులో శుద్ధి చేసి బంగారం గా మార్చారు. భారత్ నుంచి బంగారాన్ని తీసుకెళ్లామనేదానికి ఆధారాలు లేకుండా చేశారు. భారత్ నుంచి తీసుకెళ్లిన బంగారాన్ని భారీగా నిల్వచేసిన ఆంగ్లేయులు తమ దేశాన్ని సంపన్నం చేసుకున్నారు.. బంగారం మాత్రమే కాకుండా విలువైన ఖనిజాలను కూడా తమ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా పేరు పొందిన కోహినూర్ మన దేశానికి చెందినదే. దీనిని కూడా ఆంగ్లేయులు వారి ప్రాంతానికి తీసుకెళ్లారు . ఎలిజబెత్ ధరించిన కిరీటంలో కోహినూర్ వజ్రం ఉంది. కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా గుర్తింపు పొందింది.
Also Read: 52.3 కోట్లతో జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం..ఆ డబ్బుతో ఏం చేశాడంటే?
ఇక లండన్ లో ఆయా దేశాల చెందిన బంగారాన్ని భద్రపరుస్తున్న నేపథ్యంలో.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు యూరప్ దేశాలు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రతి ఏడాది నిర్ణీత మొత్తంలో రుసుము చెల్లిస్తాయి. ఎందుకంటే ఈ బంగారాన్ని భద్రపరచడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేక రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఆ రక్షణ చర్యల నిర్వహణకు డబ్బులు కావాలి కాబట్టి.. ఆయా దేశాలు, ఆర్థిక సంస్థల నుంచి రుసుము స్వీకరిస్తుంది.. భవిష్యత్తు కాలంలో బంగారం నిల్వలు పెరిగినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ బ్యాంక్ తన కార్యాలయాన్ని మరింతగా విస్తరించింది. ఎటు చూసినా గోల్డ్ బార్ లు కనిపిస్తున్న నేపథ్యంలో.. అది ఒక కేజీఎఫ్ లాగా దర్శనమిస్తోంది.