కరోనా నిర్మూలనకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ల పంపిణీ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ ను ఇస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మొదటి వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ పై భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో తొలి టీకా తీసుకున్న ప్రధానిగా బెంజమిన్ నిలిచారు. ఇజ్రాయెల్ లో ఇప్పటి వరకు 3.72 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో దాదాపు 3 వేల మంది ప్రాణాలు పోయాయి. ఇజ్రాయిల్ కు ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్లు సరఫరా అయ్యాయి. శనివారం ప్రధానమంత్రి వ్యాక్సిన్ వేయించుకోవడంతో టీకా పంపిణీ ప్రారంభమైంది.