https://oktelugu.com/

మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్‌ తీసుకోబోతోందా..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలోనూ తీర్మానం చేసి వర్క్‌ స్టార్ట్‌ చేశారు. పెద్ద స్థాయిలో భూములూ సేకరించారు. అయితే.. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు నిర్ణయాన్ని రద్దు చేశారు. ఏకంగా మూడు రాజధానుల వేదిక పాలన నడుస్తుందని ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆ పంచాయితీ నడుస్తూనే ఉంది. దీనిపై పలువురు కోర్టుకు వెళ్లడంతో ఇంకా ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 20, 2020 / 09:48 AM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీలోనూ తీర్మానం చేసి వర్క్‌ స్టార్ట్‌ చేశారు. పెద్ద స్థాయిలో భూములూ సేకరించారు. అయితే.. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు నిర్ణయాన్ని రద్దు చేశారు. ఏకంగా మూడు రాజధానుల వేదిక పాలన నడుస్తుందని ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో ఆ పంచాయితీ నడుస్తూనే ఉంది. దీనిపై పలువురు కోర్టుకు వెళ్లడంతో ఇంకా ఆ కేసు పెండింగ్‌లోనే ఉంది.

    Also Read: రిఫరెండమా? చంద్రబాబు గాలితీసిన వంశీ

    మూడు రాజధానులు చేయడం పక్కా అని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించిన తర్వాత.. ఇప్పుడు అధికార పార్టీ ముఖ్య నేతలు అదే విషయాన్ని పదేపదే నొక్కి వక్కానిస్తున్నారు. ఇప్పుడు అంతలా స్ట్రాంగ్‌లా చెప్పడానికి కారణమేంటని ఎవరికీ అంతుబట్టడం లేదు. మూడు రాజధానులపై తాము వెనక్కి తగ్గబోమని.. తమ విధానం అదేనని చెప్పుకొస్తున్నారు. విజయసాయిరెడ్డి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి వరకూ అదే చెబుతున్నారు. అయితే.. వైసీపీ వైఖరి మూడు రాజధానులేనని ఏడాది కిందటే స్పష్టమైంది. కానీ.. ఒకే రాజధాని ఉండాలని ఇతర విపక్షాలు మాత్రం పోరాడుతున్నాయి.

    కర్నూలులో హైకోర్టు ఏర్పాటుచేస్తూ న్యాయరాజధాని చట్టం చేస్తే చెల్లదని అందరికీ తెలిసిందే. అయినా చట్టం చేసి.. కోర్టుల్లో పోరాడుతోంది వైసీపీ ప్రభుత్వం. అంత పట్టుదల ప్రదర్శిస్తున్న విషయం కళ్ల ముందు కనిపిస్తుంటే.. ఇప్పుడు కొత్తగా తాము మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని సర్టిఫికెట్లు స్వయంగా జారీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది కీలక ప్రశ్న. బహుశా వెనక్కి తగ్గుతున్నారని ప్రచారం జరగడానికే ఇప్పుడు.. వ్యూహం మార్చారన్న అభిప్రాయం కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

    Also Read: చంద్రబాబు, జగన్.. ఓ అధికారి బలి!

    ఇదిలా ఉండగా.. మూడు రాజధానుల అంశంపై గతంలో చూపించిన స్పీడ్‌ ఇప్పుడు చూపించడం లేదు అక్కడి సర్కార్‌‌. కొద్ది రోజుల కిందటి వరకూ ఏ క్షణమైనా ప్రభుత్వ యంత్రాంగం అంతా విజయవాడకు వెళ్తుందన్నట్లుగా ఉండేది. కానీ.. ఇప్పుడు అలాంటి హడావుడి లేదు. ప్రకటనలు మాత్రం వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉండటం ఓ కారణం అయితే.. న్యాయపరమైన చిక్కులు మరో కారణం. అయితే జగన్ అసెంబ్లీలో వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం.. సీఎం ఎక్కడినుంచైనా పని చేసుకోవచ్చు. జగన్ వెళ్లాలనుకుంటే రాత్రికి రాత్రి వెళ్లిపోవచ్చునని కానీ ఎందుకో ఆలోచిస్తున్నారని వైసీపీ నేతలు కొత్తగా చర్చ మొదలు పెడుతున్నారు. మొత్తంగా చూస్తే మూడు రాజధానుల విషయంలో వైసీపీ కూడా ఏమైనా యూటర్న్‌ తీసుకోబోతోందా అంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్