లంబసింగికి పోయొద్దామా..

దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. ఓ వైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపరులు… అలా అలా మైమరిపించే అతిచల్లని గాలులు… ఒకవైపు వలస పూల సోయగాలు… మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు…. అంతా ప్రకృతి సోయగాలమయం. వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం…ఇవన్నీ చూడాలంటే ఏ స్విట్జర్లాండ్‌కో.. కనీసం కశ్మీర్‌‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగిగి వెళ్తే చాలు. పర్యాటక ప్రియులు ముద్దుగా దీనినే ‘కాశ్మీర్‌‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని కూడా పిలుచుకుంటుంటారు. ‘ఆంధ్రా ఊటీ’ గా సంభోదిస్తుంటారు. […]

Written By: Srinivas, Updated On : December 20, 2020 10:22 am
Follow us on


దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. ఓ వైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపరులు… అలా అలా మైమరిపించే అతిచల్లని గాలులు… ఒకవైపు వలస పూల సోయగాలు… మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు…. అంతా ప్రకృతి సోయగాలమయం. వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం…ఇవన్నీ చూడాలంటే ఏ స్విట్జర్లాండ్‌కో.. కనీసం కశ్మీర్‌‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని లంబసింగిగి వెళ్తే చాలు. పర్యాటక ప్రియులు ముద్దుగా దీనినే ‘కాశ్మీర్‌‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని కూడా పిలుచుకుంటుంటారు. ‘ఆంధ్రా ఊటీ’ గా సంభోదిస్తుంటారు.

Also Read: అయోధ్యలో రూ.1000 కోట్ల రామాలయం నిర్మాణానికి నిధులు ఎలా వస్తున్నాయి?

విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది ఈ లంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం దాటిన తర్వాత 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. నాలుగేళ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే ఆంధ్రా కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అనే పేర్లొచ్చాయి. ఇక్కడి ఉష్ణోగ్రతలు శీతాకాలంలో 0 డిగ్రీలు లేదా అంతకంటే అంత కంటే తక్కువగా నమోదవుతాయి. మిగితా కాలాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదైతాయి.

శీతాకాలంలో మంచు ముద్దగా మారిపోతుండగా.. ఉదయం 10 దాటిన కూడా సూర్యుడు కానరాడు. మళ్లీ మధ్యాహ్నానికే సెలవు తీసుకుంటుంటాడు. ఇక ఇక్కడ డిసెంబర్, జనవరి నెలల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి. ఇక్కడ వాన కంటే దారుణంగా మంచు కురుస్తుంటుంది. కర్రలా బిగుసుకుపోయే అనుభవం కూడా లంబసింగికి వచ్చే పర్యాటకులకు అర్థమవుతుంటుంది.

Also Read: తెలంగాణలో కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడో తెలుసా?

లంబసింగికి 27 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి జలపాతం అందాలు కూడా అదుర్స్ అనేలా ఉంటాయి. ఇక పచ్చదనం నిండుగా పరుచుకునే ఈ ప్రదేశంలో పక్షుల కిలకిలరావాలు ప్రకృతిప్రేమికులకు వేణుగానమే. మొత్తానికి వేసవిలోనే పది డిగ్రీల ఉష్ణోగ్రతతో చల్లగా ఉండే లంబసింగి శీతాకాలం మంచుతో కప్పబడి ఉందే కూలెస్ట్ విలేజ్‌గా చెప్పుకోవాలి. ఈ సీజ‌న్ లో టూరిస్టుల సందడి కూడా ఎక్కువగానే ఉంటుంది. వీలైతే ఒకసారి సందర్శించండి. అక్కడి అందాలను వీక్షించండి.