భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను అరికట్టడంలో భారత్‌ ముందున్నదని చెబుతున్నా..కచ్చతమైన లెక్కలు చెప్పడం లేదని అన్నారు. త్వరలో అమెరికాలో జరగబోయే ఎన్నికల సందర్భంగా తన ప్రత్యర్థి బైడెన్‌తో చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ను అరికట్టడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని బైడెన్‌ ఆరోపించగా ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడారు. చైనా, రష్యా దేశాల్లో కరోనా మరణాలను కచ్చితంగా వెల్లడించడం లేదు. అలాగే భారత్‌లో కూడా అదే పరిస్థితి […]

Written By: NARESH, Updated On : September 30, 2020 5:26 pm
Follow us on

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను అరికట్టడంలో భారత్‌ ముందున్నదని చెబుతున్నా..కచ్చతమైన లెక్కలు చెప్పడం లేదని అన్నారు. త్వరలో అమెరికాలో జరగబోయే ఎన్నికల సందర్భంగా తన ప్రత్యర్థి బైడెన్‌తో చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ను అరికట్టడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందని బైడెన్‌ ఆరోపించగా ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడారు. చైనా, రష్యా దేశాల్లో కరోనా మరణాలను కచ్చితంగా వెల్లడించడం లేదు. అలాగే భారత్‌లో కూడా అదే పరిస్థితి ఉంది అని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదు కాగా భారత్‌ రెండో స్థానంలో ఉంది. అయితే రికవరీ రేటులో భారత్‌ మెరుగుస్థితిలో ఉందని వస్తున్న వార్తలపై ట్రంప్‌ ఈ విధంగా వాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: కరోనాతో మరో సంచలన ప్రమాదం వెలుగులోకి..