https://oktelugu.com/

లాక్డౌన్ నష్టాలను పూడ్చుకుంటున్న రామోజీరావు?

కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ ప్రభావం సామాన్యులు.. మధ్యతరగతిపై తీవ్రంగా చూపింది. కేంద్రం ప్రస్తుతం అన్ లాక్ విధిస్తున్న కరోనా ప్రభావం నుంచి మాత్రం పేదలు కోలుకోలేకపోతున్నారు. ఇక కరోనా ఎఫెక్ట్ తో శ్రీమంతులు సైతం కుదేలయ్యారు. నిత్యం వేలకోట్ల రూపాయల వ్యాపారాలు చేసే కంపెనీలు సైతం కరోనా దాటికి మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రంగంపై పనిచేసే వేలాది కార్మికులు రోడ్డునపడుతున్నారు. Also Read: టాలీవుడ్ పై […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 3:42 pm
    Follow us on

    కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ ప్రభావం సామాన్యులు.. మధ్యతరగతిపై తీవ్రంగా చూపింది. కేంద్రం ప్రస్తుతం అన్ లాక్ విధిస్తున్న కరోనా ప్రభావం నుంచి మాత్రం పేదలు కోలుకోలేకపోతున్నారు. ఇక కరోనా ఎఫెక్ట్ తో శ్రీమంతులు సైతం కుదేలయ్యారు. నిత్యం వేలకోట్ల రూపాయల వ్యాపారాలు చేసే కంపెనీలు సైతం కరోనా దాటికి మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ రంగంపై పనిచేసే వేలాది కార్మికులు రోడ్డునపడుతున్నారు.

    Also Read: టాలీవుడ్ పై ఉమ్మేస్తున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు?

    ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా, టీవీ షూటింగులకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడిప్పడే ఈ పరిశ్రమ గాడిలో పడుతోంది. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగుల్లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో చిత్రసీమను నమ్ముకొని జీవిస్తున్న కొంతమందికి ఉపాధి లభిస్తోంది. పరిమిత సంఖ్యలోనే నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగుల్లో పాల్గొంటున్నారు. అయితే రానున్న రోజుల్లో పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం కన్పిస్తోంది.

    భారతదేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీకి  సినిమాల పరంగా మంచి గుర్తింపు ఉంది. అన్నిరకాల షూటింగులకు అనుకూలంగా రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీరావు నిర్మించిన సంగతి తెల్సిందే. అయితే కరోనా ప్రభావంతో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగులు నిలిచిపోయాయి. అదేవిధంగా ఫిల్మ్ సిటీని నిత్యం సందర్శించేందుకు వచ్చే వేలాదిమంది టారిస్టులు నిలిచిపోయారు. దీంతో కొన్నినెలలుగా రామోజీ రావుకు వేల కోట్ల ఆదాయం నిలిచిపోయింది.

    అదేవిధంగా రామోజీరావు గ్రూప్ సంస్థలకు మూలస్థంభంగా నిలిచే ‘ఈనాడు’ కూడా కరోనా ధాటికి విలవిలలాడిపోయింది. లాక్డౌన్ కారణంగా వ్యాపారాలన్నీ కుదేలవడంతో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. దీంతో సర్యులేషన్, సిబ్బంది జీతాల్లో కోత వంటి చర్యలు చేపట్టాల్సి వచ్చింది. కేవలం ఈటీవీ పరిస్థితి మాత్రమే రామోజీరావుకు కొంత ఆశాజనకంగా నిలిచింది.

    కొన్నినెలలుగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగులు నిలిచిపోయి వేలకోట్ల ఆదాయం కోల్పోయిన రామోజీ రావుకు తాజా పరిస్థితులు కలిసి వస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లో ఔట్ డోర్ షూటింగ్ చేసే అవకాశం లేదు. అదేవిధంగా నగరంలోని స్టూడియోల్లో చాలా ఉండే అవకావం ఉంది. భారీతనంతో సిన్స్ తీయాలంటే రామోజీ ఫిల్మ్ సిటీనే కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.

    Also Read: బిగ్ బాస్ పై దేవి నాగవల్లి సంచలన ఆరోపణలు

    దీంతో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రస్తుతం షూటింగులతో కళకళలాడుతోంది. కొద్దినెలల వరకు షూటింగుల్లేక బోసిపోయిన రామోజీ ఫిల్మ్ సిటీ కేవలం నెలరోజుల వ్యవధిలోనే బీజీగా మారిపోయింది. లాక్డౌన్లో కొల్పోయిన ఆదాయం కొద్దిరోజుల్లోనే రామోజీరావుకు రావడం ఖాయంగా కన్పిస్తోంది.