చైనాపై వ్యాపారవేత్త విమర్శలు: అనంతరం అదృశ్యం

చైనా ప్రభుత్వాన్ని విమర్శలు చేసిన వారంతా కనిపించకుండా పోతున్నారు. గతంలో ఓ జర్నలిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడంతో కొన్నిరోజులు కనిపించకుండా వెళ్లారు. ఆ తరువాత పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా చైనా దిగ్గజ వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా రెండు నెలల నుంచి ఎక్కడా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. జాక్ సైతం ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చైనా చేసిన ఆర్థిక సంస్కరణలను జాక్ తీవ్రంగా విమర్శించారు. అనంతరం ఆయన వ్యాపార […]

Written By: Suresh, Updated On : January 4, 2021 1:22 pm

china

Follow us on

చైనా ప్రభుత్వాన్ని విమర్శలు చేసిన వారంతా కనిపించకుండా పోతున్నారు. గతంలో ఓ జర్నలిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడంతో కొన్నిరోజులు కనిపించకుండా వెళ్లారు. ఆ తరువాత పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా చైనా దిగ్గజ వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా రెండు నెలల నుంచి ఎక్కడా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. జాక్ సైతం ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చైనా చేసిన ఆర్థిక సంస్కరణలను జాక్ తీవ్రంగా విమర్శించారు. అనంతరం ఆయన వ్యాపార కార్యకాలపాల్లో రూ.83 వేల కోట్లు నష్టపోయారు. అయితే ప్రస్తుతం ఆయన కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది.