Homeఆంధ్రప్రదేశ్‌పేకాట క్లబ్బులపై పోలీసుల...

పేకాట క్లబ్బులపై పోలీసుల దాడులు.. ఏపీలో ఏం జరుగుతోంది..?

Poker
ఆంధ్రలో పేకాటకు, కోడి పందేలకు కొదువ ఉండదు. అందులోనూ సంక్రాంతి వచ్చిందంటే ఏపీ మొత్తం కోడి పందేలతో మంచి జోష్‌ మీద ఉంటుంది. ఇక పేకాట సరేసరి. పండుగలు పబ్బాలు అంటూ తేడా లేకుండా జోరుగా నడుస్తుంటాయి. పేకాట క్లబ్బులు కూడా ఉంటాయి. వాటి వైపు పోలీసులు కూడా పెద్దగా కన్నెత్తి చూడరు. కానీ.. తాజా పరిణామాలు ఏపీలో ఆసక్తిగా రేపుతున్నాయి. పేకాట క్లబ్బులపై పోలీసులు దాడులు చేయడం రాజకీయంగా కలకలం మొదలైంది.

Also Read: ఏపీలో దేవుళ్ల విగ్రహాల ధ్వంసంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

అక్కడ పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని.. రోజుకు కోట్ల కొద్దీ నగదు చేతులు మారుతోందని.. అంతర్రాష్ట్ర మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తారనేది బహిరంగ రహస్యం. చాలా సార్లు మీడియాలో కూడా వచ్చింది. కానీ.. ఎప్పుడూ పోలీసులు అటు వైపు చూసిన పాపాన పోలేదు. పోయే ధైర్యం కూడా చేయలేదు. కానీ ఇప్పుడే ఎందుకు దాడులు చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పేకాట శిబిరాల్లో అత్యధికంగా నగదు ఉండే సమయం పేకాట రాయుళ్లు ఉండే సమయం చూసి పోలీసులు దాడి చేశారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. ఇది ఓ రకంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్న ప్రముఖ నాయకుడికి.. ఆయన అనుచరులకు షాక్ లాంటిది.

Also Read: కృష్ణా బోర్డుపై జగన్‌ యూటర్న్‌..: విశాఖలో పెట్టాలంటూ కేంద్రానికి లేఖ

తమకు తెలియకుండా గుడివాడలో కనీసం పోలీస్ కానిస్టేబుల్ కూడా.. తమ శిబిరాల వైపు అడుగు పెట్టరని అంతగా అధికార యంత్రాంగంపై పట్టు సాధించామని వారు భావిస్తుంటారు. కానీ.. నిజానికి ఆయనకు ఉన్న పట్టు కన్నా ఆ పై స్థాయి యంత్రాంగానికి ఉండే పట్టు ఎక్కువ. ఎప్పుడైతే ఆ నేతను బుక్ చేయాలనుకుంటున్నారో అప్పుడే ఎటాక్ చేయాలని చాలా కాలంగా స్కెచ్ రెడీ చేసి పెట్టుకున్నట్లుగా సమాచారం. అందుకే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎదురులేదనే నేత.. విచ్చలవిడిగా అసాంఘిక వ్యవహారాలకు అనుచరుల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక్క సారిగా ఆయనపై కట్టడి ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

సామాజికవర్గ పరంగా ప్రభుత్వ పెద్దలు తీవ్ర వ్యతిరేకత చూపే వర్గానికి చెందిన సదరు నేత.. పెద్దల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. తన వ్యక్తిగత ఇమేజ్ పాతాళంలోకి వెళ్లిపోయినా వెనక్కి తగ్గకుండా విధేయత చూపించడానికి వెనుకాడరు. అయినప్పటికీ.. పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ పెద్దలు రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంది మంత్రి పదవుల్ని తీసేసి కొత్త వారికి ఛాన్స్‌ ఇస్తానని చెప్పారు. అయితే.. ఇప్పటికే మంత్రి జయరాం అలాంటి ముద్రపడిపోయి సైలెంటయ్యారు. ఇక ఇప్పుడు కృష్ణా జిల్లా మంత్రి వంతు వచ్చినట్లుంది. అందుకే.. ఆయనను టార్గెట్‌ చేసి.. ఆయన వ్యవహారాలపై ఫోకస్‌ పెట్టినట్లు అర్థమవుతోంది.

Get notified whenever we post something new!

Continue reading

Healthy Lifestyle Tips: 18 ఏళ్లు నిండిన వారిలో ఈ సమస్యలు.. ఎందుకో తెలుసా?

Healthy Lifestyle Tips: ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పేవారు. ఎందుకంటే ఈ వయసులో ఉన్న వారి ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి తగ్గుతుంది. రక్త ప్రసరణ కూడా నెమ్మదిస్తుంది. అంతేకాకుండా ఈ వయసులో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చిన గుండెపోటు...

Emotional Rakhi Story: 40 ఏళ్ల తర్వాత రాఖీ కట్టిన సోదరి.. ఎందుకో తెలుసా?

Emotional Rakhi Story: దేశవ్యాప్తంగా రాఖి పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరీమణులు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఇందుకు ప్రత్యేకగా సోదరులు తమ చెల్లెళ్లకు విలువైన బహుమతులను అందించారు. కొందరు చెల్లెళ్ళు ప్రతి ఏటా రాఖీని కడుతూ సోదరులపై మమకారాన్ని చూపిస్తున్నారు. కానీ...

Loan Management Tips: మనదేశంలో ఎన్ని కోట్ల మంది లోన్లు తీసుకుంటున్నారో తెలుసా?

Loan Management Tips: మనిషి అవసరానికి డబ్బు చాలా అవసరం. అయితే అందరి వద్ద అనుకున్నంత ఆదాయం ఉండదు. కానీ నేటి కాలంలో ఆదాయానికి మించిన అవసరాలు, ఖర్చులు ఏర్పడుతున్నాయి. దీంతో అదనపు ఆదాయం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ అప్పులు బ్యాంకు లోన్ తీసుకునే అంతవరకు ఉంటున్నాయి. కొందరు ఇంట్లో అవసరాల...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version