
రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు ఆలయాలపై దాడులు చేస్తున్నారని ఏపీ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలకు దేవుడిని వాడుకుంటున్నారన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులు ఇష్టంలేని కొందరు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్న రోజుల్లోనే విగ్రహాలు ధ్వంసానికి గురికావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రచారం కాకూడదనే విగ్రహ ధ్వంసం కుట్రలు జరుగుతున్నాయన్నారు. 20 వేల ఆలయాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు అమర్చామని, తప్పు ఎవరూ చేసిన విడిచిపెట్టేది లేదని జగన్ స్పష్టం చేశారు.