కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అతలాకుతమైంది. ఈ వైరస్ నివారణకు వ్యాక్సిన్లు సిద్ధం కావడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ తరుణంలో బ్రిటన్ లో కొత్త రకం వైరస్ విజ్రుంభిస్తోంది. ఈ వైరస్ 70 శాతం వేగంగా విస్తరిస్తోందని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. దీంతో వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు లండన్ తో పాటు దక్షిణ ఇంగ్లాండ్ లో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. శనివారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ప్రజలు ఇళ్ల లో నుంచి బయటకు రావద్దని పిలుపునిచ్చింది. ఫలితంగా క్రిస్మస్ ఉత్సవాలు నిర్వహించుకోవడం వీలయ్యే అవకాశం లేదు. దీంతో యూకె ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు.