https://oktelugu.com/

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ ఎప్పుడంటే..?

గత కొన్ని రోజుల నుంచి రైతులు పీఎం కిసాన్ ఏడో విడత డబ్బులు ఖాతాలలో ఎప్పుడు జమవుతాయో అని వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీనే రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉన్నా ఢిల్లీలో రైతుల ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ కావడం ఆలస్యమైంది. గతేడాది కూడా డిసెంబర్ నెలలో పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులు పొందే నగదు ఆలస్యంగా జమైన సంగతి తెలిసిందే. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 20, 2020 / 10:44 AM IST
    Follow us on


    గత కొన్ని రోజుల నుంచి రైతులు పీఎం కిసాన్ ఏడో విడత డబ్బులు ఖాతాలలో ఎప్పుడు జమవుతాయో అని వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీనే రైతుల ఖాతాల్లో నగదు జమ కావాల్సి ఉన్నా ఢిల్లీలో రైతుల ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ కావడం ఆలస్యమైంది. గతేడాది కూడా డిసెంబర్ నెలలో పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులు పొందే నగదు ఆలస్యంగా జమైన సంగతి తెలిసిందే.

    ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా మోదీ సర్కార్ నగదును జమ చేయనుందని.. ఆరోజు పండగ రోజు కావడంతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జన్మదినం కావడంతో ఆరోజు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుందని సమాచారం. మధ్యప్రదేశ్ రైతులతో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ స్కీమ్ గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. స్వయంగా మోదీ ఈ విషయాన్ని వెల్లడించడంతో పీఎం కిసాన్ ఏడో విడత నిధుల జమ గురించి స్పష్టత వచ్చింది.

    ఇప్పటికే ఈ స్కీం ద్వారా ప్రయోజనాలు పొందుతున్న వారితో పాటు అర్హత ఉండి పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందలేకపోతున్న రైతులు పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాలను సైతం సులభంగా తెలుసుకోవచ్చు.

    ప్రతి సంవత్సరం మోదీ సర్కార్ 6,000 రూపాయలు పీఎం కిసామ్ స్కీమ్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్, ఆగష్టు, డిసెంబర్ నెలల్లో రైతుల ఖాతాల్లో నగదు జమవుతూ ఉండగా పరిస్థితులను బట్టి మోదీ సర్కార్ పీఎం కిసాన్ నిధుల జమ విషయంలో కేంద్రం అప్పుడప్పుడూ మార్పులు చేస్తోంది. కేంద్రం జమ చేస్తున్న ఈ నగదు పెట్టుబడి సాయంగా రైతులకు ఉపయోగపడుతోంది.