జార్జియాలో బైడెన్ మళ్లీ గెలిచాడు.

. అమెరికా అధ్యక్షడిగా జో బైడెన్ ఇప్పటికే మేజిక్ ఫిగర్ దాటి అర్హత సాధించాడు. అయితే చివరిగా సాగుతున్న జార్జియా ఓట్లపై ఉత్కంఠ కొనసాగింది. అయితే చివరికి ఇక్కడ బైడెన్ కు 49.5 శాతం ఓట్లు, ట్రంప్ నకు 49.2 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఓట్ల లెక్కంపులో తేడా జరిగిందని రిపబ్లికన్ పార్టీ ఆరోపించింది. జార్జయాలోని 159 కౌంటీల్లో 97 కౌంటీల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాయి. గెలుపు ధ్రువ పత్రాలు కూడా విడుదల చేశారు. అవి […]

Written By: Velishala Suresh, Updated On : November 20, 2020 2:56 pm
Follow us on

.

అమెరికా అధ్యక్షడిగా జో బైడెన్ ఇప్పటికే మేజిక్ ఫిగర్ దాటి అర్హత సాధించాడు. అయితే చివరిగా సాగుతున్న జార్జియా ఓట్లపై ఉత్కంఠ కొనసాగింది. అయితే చివరికి ఇక్కడ బైడెన్ కు 49.5 శాతం ఓట్లు, ట్రంప్ నకు 49.2 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఓట్ల లెక్కంపులో తేడా జరిగిందని రిపబ్లికన్ పార్టీ ఆరోపించింది. జార్జయాలోని 159 కౌంటీల్లో 97 కౌంటీల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాయి. గెలుపు ధ్రువ పత్రాలు కూడా విడుదల చేశారు. అవి రాజధానికి చేరేలోనే రిపబ్లికన్ పార్టీ అడ్డుకుంది. దీందో అధికారులు రీకౌంటింగ్ కు ఆదేశించారు. రీకౌంటింగ్ కు ముందు ట్రంప్, బౌడెన్ మధ్య 14వేల ఓట్లు తేడా ఉండగా, రీకౌంటింగ్ తరువాత బైడెన్ 12,284 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ మేరకు జార్జియా అధికారులు ప్రకటించారు.