
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణ బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ కలిసి పవన్ కల్యాణ్ తో సమావేశం కావడం చర్చనీయాశంగా మారింది. గత కొద్ది రోజులగా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన తెలంగాణ ఇన్ చార్జి ప్రకటించారు. అయితే పవన్ అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో వీరి సమావేశంపై రకరకాల వాదనలు వస్తున్నాయి.