దేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం నిబంధనలలో కీలక మార్పులు చేసింది. ఏటీఎం క్యాష్ విత్ డ్రా నిబంధనలను సవరించింది. కొన్ని నెలల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం నిబంధనలను సవరించగా ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం అదే బాటలో నడుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఇకపై ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మొబైల్ ఫోన్ ను వెంట తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది.
Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. తెలియకుండా స్టేటస్ చూసే ఛాన్స్..?
కస్టమర్లు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేయాలంటే ఖచ్చితంగా వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే కస్టమర్లు ఏటీఎం నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవడం సాధ్యపడదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. అయితే 10,000 రూపాయలకు పైగా విత్ డ్రా చేయాలంటే మాత్రమే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
Also Read: ప్రేమ ఎక్కువై కొడుకును చంపిన తండ్రి.. ఎందుకంటే..?
10,000 రూపాయల లోపు లావాదేవీలకు మాత్రం ఓటీపీ ఎంటర్ చేయకుండానే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలు ఉన్న కస్టమర్లకు ఈ నిబంధనలు వర్తించవు. రోజురోజుకు ఏటీఎంలకు సంబంధించిన మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఇతర ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసుకున్నా ఈ నిబంధనలు వర్తించవు.
మరిన్ని వార్తలు కోసం: జనరల్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్వీట్ ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు జరిపే లావాదేవీలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఓటీపీ ఆధారిత సర్వీసుల ద్వారా నగదు విత్ డ్రా చేయడం మరింత సులభం చేస్తున్నామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెబుతోంది.
Save the dates!
PNB 2.0 is launching OTP based cash withdrawals from 1st December 2020.
Making withdrawals easy, banking easier. pic.twitter.com/EsuXJvSTM3— Punjab National Bank (@pnbindia) November 26, 2020