Bhimashankar Jyotirlinga Temple
Bhimashankar Jyotirlinga Temple: సనాతన ధర్మంలో దేవాలయాల సందర్శన ఎంతో పుణ్యం ఇస్తుంది. అందుకే మనం కోరిన కోరికలు నెరవేరాలని దేవుళ్లను సందర్శిస్తూ ఉంటాం. మనం కోరుకున్న కోరికలు నెరవేర్చే దేవుళ్లు ఉంటే వాటిని సందర్శించి మన కష్టాలు చెప్పుకుంటాం. మమ్మల్ని గట్టెక్కించాలి దేవుడా అని వేడుకుంటాం. ఇలా ఒక్కో క్షేత్రానికి ఒక్కో విలువ ఉంటుంది. స్థలపురాణాన్ని బట్టి దేవాలయాల విలువ పెరుగుతుంది. దేవుడి మహిమలు తెలిస్తే ఎవరు కూడా వదిలిపెట్టరు. ఆ ఆలయం దేనికి ప్రసిద్ధో తెలుసుకుని వాటిని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకుని తమ బాధలను దూరం చేయాలని ఆకాంక్షిస్తారు.
మహారాష్ట్రలోని పూణే కు 127 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమశంకర ఆలయం గురించి తెలుసుకోవాల్సిందే. ఇది భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తుని తొలగించడం వల్ల భీమ శంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ముంబయికి 200 కిలోమీటర్ల దూరంలో పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకాలో భీమా నది ఒడ్డున భావగిరి అనే గ్రామంలో ఈ ఆలయం వెలసింది.
కొండపై భాగంలో కొండపై భాగంలో పరమశివుడు భీమ శంకర జ్యోతిర్లింగంగా అవతరించాడు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్ధంలో నాగరా పద్ధతిలో పీశ్వర్ దీవాన్ అయిన నానా పడ్నవీస్ నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్ట తెలుస్తోంది. ఇక్కడకు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం నల్లటి రాతితో చెక్కబడింది. అందుకే చూడ్డానికి అందంగా ఉంటుంది.
గుడిలో శివలింగాన్ని వెండితో తాపడం చేశారు. దాని మీద ఒక కత్తి గాటు ఉంటుంది. కొండల్లో కొలువైన ఈ ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. ఆగస్టు, ఫిబ్రవరి నెలల్లో ఈ దేవాలయాన్ని చూడటానికి అనుకూలంగా ఉంటుంది. కృష్ణ నదికి ఉప నది అయిన భీమ నది ఇక్కడ పుట్టింది. దీంతో ప్రకృతి పరవశంగా కనిపిస్తుంది. ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే రోగాలు నయమవుతాయని చెబుతారు. అదృష్టం కూడా పడుతుందని నమ్ముతారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Interesting facts about bhimashankar jyotirlinga temple
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com