దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే విమాన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. బిగ్ ఫ్లాట్ ఇండిగో సేల్ పేరుతో ఇండిగో ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తుండగా ఈ సేల్ లో 877 రూపాయలకే విమాన టికెట్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇండిగో పరిమిత కాలానికి మాత్రమే ఈ ఆఫర్ ను అందిస్తూ ఉండటం గమనార్హం. జనవరి 13వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
877 రూపాయలకే టికెట్ ను కొనుగోలు చేసిన వాళ్లు ఈ ఏడాది ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 30వ తేదీలోపు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇండిగో నడుపుతున్న నాన్ స్టాప్ ఫ్లైట్స్ టికెట్లు బుకింగ్ చేసుకునే వాళ్లు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హులు. ఈ ఆఫర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఆఫర్ ప్రయాణికులకు ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
బుకింగ్ చేసుకున్న తరువాత ప్రయాణ తేదీని మార్చుకున్నా లేక టికెట్ ను క్యాన్సిల్ చేసినా 500 రూపాయలు ఫీజుగా ఉంటుంది. తక్కువ సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆసక్తి ఉన్న ప్రయాణికులు వీలైనంత త్వరగా టికెట్లను బుకింగ్ చేసుకుంటే మంచిది. ఇండిగో సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ కస్టమర్లు, హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు కలిగిన కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుండటం గమనార్హం.
హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు కలిగిన వాళ్లు 5 శాతం క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉండగా ఇండస్ ఇండ్ బ్యాంక్ కస్టమర్లు గరిష్టంగా 5 వేల రూపాయలు క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.
We see travel on your cards this year! 🔮 Grab our most-awaited sale and take-off into the skies! Your lean, clean flying machine is waiting. 🛫
Book now https://t.co/oxMDcIDjm5 @HSBC_IN @MyIndusIndBank#LetsIndiGo #Sale #BigFatIndiGoSale #aviation pic.twitter.com/uiNYqJ3t3w— IndiGo (@IndiGo6E) January 13, 2021
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Indigo announces big fat sale book domestic flight tickets starting from rs 877
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com