PM Modi Amaravati Visit: అమరావతి రాజధాని( Amaravathi capital ) పునర్నిర్మాణ సమయం ఆసన్నం అయ్యింది. రేపు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పనుల ప్రారంభానికి సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తోంది. జన సమీకరణ కూడా భారీగా జరుగుతుంది. అమరావతి పరిధిలోని సచివాలయ భవనం వెనుక భాగంలో వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెహల్ గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో.. అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు అసాధారణ రీతిలో భద్రత కల్పిస్తున్నారు.
Also Read: ఆ వైసీపీ మాజీ ఎంపీ రాజకీయ నిష్క్రమణ!
* భారీగా జన సమీకరణ
కృష్ణా( Krishna), గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉభయగోదావరి జిల్లాల నుంచి సైతం జన సమీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబాలకు ఇప్పటికే సిఆర్డిఏ అధికారులు ఆహ్వానాలు పంపించారు. ఈ ఆహ్వానాలు ఉన్నవారికి మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ఆహ్వాన పత్రికలు లేకుంటే.. ఎట్టి పరిస్థితుల్లో సభా ప్రాంగణంలో అడుగుపెట్టలేని దిశగా భద్రతా చర్యలు జరుగుతున్నాయి. ఈ ఇన్విటేషన్ కార్డును ఇతరులు వినియోగించడానికి కూడా వీల్లేకుండా పట్టిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఇక సభకు వచ్చేవారు ఖాళీ చేతులతోనే సభా ప్రాంగణంలో అడుగు పెట్టాలని సిఆర్డిఏ అధికారులు నిబంధన పెట్టారు. దేశ ప్రధాని హాజరవుతున్న దృష్ట్యా భద్రతా కారణాలతోనే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
* ఆ వస్తువులు తేకూడదు..
ప్రధాని అమరావతి సభకు వచ్చేవారు మొబైల్ ఫోన్లు( mobile phones), హ్యాండ్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు, కెమెరాలు, సిగరెట్లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటర్ బాటిల్లతో పాటు కారు సెంట్రల్ లాకింగ్ సిస్టం కు చెందిన పరికరాలను తీసుకురావద్దని సి ఆర్ డి ఏ అధికారులు కోరారు. ఈ విషయాలను ఆహ్వాన పత్రికలోనే స్పష్టం చేశారు. అయితే ఇన్ని నిషేధాజ్ఞలు విధించడంతో ప్రధాని పర్యటనను భద్రత దళాలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నాయో అర్థమవుతోంది. మొబైల్ ఫోన్లు లేనిది ఇంటి నుంచి బయట కాలు పెట్టలేని పరిస్థితుల్లో.. వాటిని తీసుకురాకుండా ఎలా ఈ సభను నిర్వహిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. అయితే అధికారుల ఈ వినతికి ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన వస్తోందని తెలుస్తోంది.
* గంటన్నర పాటు అమరావతిలో ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) అమరావతి రాజధాని పర్యటనకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది. అమరావతిలో దాదాపు గంటన్నర పాటు ప్రధాని మోదీ గడపనున్నారు. పెహల్ గాం ఉగ్ర దాడి నేపథ్యంలో అమరావతిలో మోడీ కార్యక్రమ వేదిక పైకి కూడా పరిమితంగానే నేతలను అనుమతించునున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వాగత వాక్యాలతో సభ ప్రారంభం అవుతుంది. చంద్రబాబు ప్రసంగం.. అటు తరువాత మోడీ ప్రసంగంతో సభ ముగియనుంది. కేవలం ఉగ్రదాడుల నేపథ్యంలోనే అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపనకు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు.
Also Read: పిసిసి మాజీ అధ్యక్షుడికి కీలక బాధ్యతలు ఇచ్చిన జగన్!