Homeబిజినెస్Skoda vs Zepto: మీరు కార్లు బుక్ చేసుకోండి.. ఇంటిముందుకే డెలివరీ ఇక చూసుకోండి.. ఈ...

Skoda vs Zepto: మీరు కార్లు బుక్ చేసుకోండి.. ఇంటిముందుకే డెలివరీ ఇక చూసుకోండి.. ఈ ఐడియా మామూల్ది కాదు..

Skoda vs Zeptoసాధారణంగా క్విక్ ఈ కామర్స్ సంస్థలు (quick E-Commerce companies) వేగంగా సరుకులు రవాణా చేస్తాయి. క్షణంలోనే కస్టమర్ ఇంటి ముందుకు చేరవేర్చుతాయి. మనకు క్విక్ ఈ కామర్స్ సంస్థలు అంటే బిగ్ బాస్కెట్ (Big basket), ఫ్లిప్ కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon), జెప్టో (zepto), బ్లింక్ ఇట్ (blink it), స్విగ్గి (swiggy), ఇన్ స్టా మార్ట్ (insta mart) గుర్తుకొస్తాయి. ఇవన్నీ కూడా క్షణకాలంలోనే సరుకులను రవాణా చేస్తాయి. నిత్యావసరాలను, ఆహార పదార్థాలను ఆర్డర్ చేస్తే.. నిమిషాల్లోనే ఇవి డోర్ డెలివరీ చేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా పాలు, కూరగాయలు, ఇతర వస్తువులను కూడా మనకు గుమ్మం దాకా తీసుకొస్తాయి.

మొదట్లో కొన్ని సంస్థలు ఇంటికి మాత్రమే అవసరమైన సరుకులను రమాణా చేసేవి. అయితే కస్టమర్ల డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్ వంటి వాటిని నిమిషాల్లోనే కస్టమర్లకు అందిస్తున్నాయి.. అయితే ఇప్పుడు ఇవి మరో కొత్త మార్గాన్ని అన్వేషించాయి. సరికొత్త వ్యాపార మెలకువను ఒంట పట్టించుకున్నాయి. ఇప్పటివరకు సరుకులు, ఇతర వస్తువుల రవాణాకు మాత్రమే పరిమితమైన సంస్థలు త్వరలోనే కార్లను కూడా రవాణా చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. సోషల్ మీడియాలో స్కోడా ఇండియా (Skoda India) ఓ టీజర్ వీడియోను విడుదల చేసింది. దాని ప్రకారం.. స్కోడా ఇండియా కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ జెప్టో తో జట్టు కట్టినట్టు తెలుస్తోంది. దాని ద్వారా ఆన్లైన్లో కార్లను విక్రయించడానికి రెడీ అయినట్టు సమాచారం. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం జెప్టో సంస్థలో తయారుచేసే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఒకరు స్కోడా షోరూమ్ కు వెళ్తారు. అక్కడ ఒక కారును కస్టమర్కు డెలివరీ చేయడానికి ట్రక్కులో తీసుకెళ్తాడు.. అయితే ఈ వీడియో చివర్లో Skoda x zepto: coming soon అని వస్తుంది.. ఈ వీడియోను స్కోడా ఇండియా షేర్ చేసింది. ఆ తర్వాత ” ఫాస్ట్ వర్సెస్ ఫ్రెష్.. మేము ఏం చేయబోతున్నాము మీకు తెలుసా.. జెప్టో, స్కోడా భవిష్యత్తు కాలంలో చేపట్టబోయే పనులు మీరు అంచనా వేయగలరా” అంటూ ఒక క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఫిబ్రవరి 8 నుంచి..

ఆన్లైన్లో కార్లను కస్టమర్లకు అందించే వ్యాపార క్రతువు ఫిబ్రవరి 8 నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి స్కోడా, జెప్టో ఆల్రెడీ హింట్స్ ఇచ్చేసాయి. సోషల్ మీడియాలోనూ తెగ ప్రచారం చేస్తున్నాయి. జెప్టో సేవలు దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలలో ప్రారంభమయ్యాయి. విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇక స్కోడా కూడా తన అమ్మకాలను పెంచుకోవడం కోసం జెప్టో తో జట్టు కట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ కార్లను క్షణాల్లోనే డెలివరీ చేస్తారా.. లేకుంటే రోజుల సమయం పడుతుందా.. సాధారణంగా మనదేశంలో కార్లను షోరూమ్ ల వద్దకు వెళ్లి మాత్రమే కొనుగోలు చేస్తారు. పైగా అన్ని సౌకర్యాలను ఒకటికి వందసార్లు చెక్ చేసుకుంటారు. అలాంటిది కార్లను ఆన్లైన్లో ప్రజలకు కొనుగోలు చేస్తారా? అది సాధ్యమవుతుందా? ఒకవేళ కస్టమర్ కోరుకున్న సౌకర్యాలు లేకపోతే తర్వాత ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. మరోవైపు స్కోడా యాడ్ ను కొంతమంది స్వాగతిస్తుండగా.. మరి కొంతమంది తిరస్కరిస్తున్నారు. అయితే ఇది విప్లవాత్మకమైన నిర్ణయమని.. ఇది మరిన్ని మార్పులకు నాంది పలుకుతుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular