Imran Khan: “ఇటలీ తుమ్మితే మిగిలిన ఐరోపా దేశాలకు జ్వరం వస్తుంది.” మొదటి ప్రపంచ యుద్ధం సమయం, ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత ఇది ఒక నానుడి అయింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం, అనేక పరిణామాలను ప్రపంచం ఎదుర్కొన్న తర్వాత.. అమెరికా అగ్ర రాజ్యంగా అవతరించింది. అన్ని దేశాల మీద పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది. తను కోరుకున్నది దక్కకపోతే అమెరికా ఎంతకు తెగిస్తుందో ఈ ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెనుకటి రోజుల్లో ప్రపంచం మొత్తం ఆంగ్లేయుల తాకిడికి గడగడ వణికితే.. ఇప్పుడు ఆ స్థానాన్ని అమెరికా భర్తీ చేస్తోంది. ఏ దేశంలో ఏం జరిగినా తన హస్తం ఉండేలా సి.ఐ.ఏ అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచం మొత్తాన్ని తన డేగ కళ్లతో పరిశీలిస్తోంది. ” ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఆందోళన, ప్రతి హింసాత్మక ఘటన వెనుక అమెరికా ఉంటుంది” ఈ మాట అన్నది సాక్షాత్తు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇంతకీ ఆయన ఎందుకు అన్నాడు? అమెరికాను ఎందుకు ఆగర్భ శత్రువుగా చూస్తున్నాడు? అమెరికా సి.ఐ.ఏ ద్వారా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ హత్యకు ఎందుకు ప్లాన్ వేసింది?
Imran Khan
ప్రస్తుతం పాకిస్థాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని చంపడానికి కుట్ర జరుగుతున్నది అని ఒక వార్త ప్రచారం లో ఉంది. కేవలం ఇది ప్రచారం కాదు ఇమ్రాన్ ఖాన్ స్వయంగానే చెప్పాడు నన్ను హత్య చేయడానికి కుట్ర జరుగుతున్నది అంటూ. ఇది కేవలం ఇమ్రాన్ ఖాన్ తన మీద సానుభూతి కలుగచేసుకోవడానికె అలా అన్నాడా ? నిజం సంగతి పక్కన పెడితే గత మాజీ ప్రధానుల చరిత్ర చూస్తే నిజమే అనుకోవాల్సి ఉంటుంది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో ని కారు బాంబు పెళుడుతో హత్యచేశారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం ఇమ్రాన్ హత్యకి కుట్రలు జరుగుతున్నాయి అనే అంటున్నారు. ఒక వేళ ఇమ్రాన్ కి ఏమన్నా అయితే మాత్రం అది పాకిస్థాన్ దేశం మీద జరిగిన దాడిగా భావించి తీవ్రంగా స్పందిస్తాం అంటూ నేరుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ – పుతిన్ సమావేశం !
గత ఫిబ్రవరి నెల 23 న ఇమ్రాన్ ఖాన్ ప్రధాని హోదాలో మాస్కో పర్యటనకి వెళ్ళిన సంగతి తెలిసిందే ! ఫిబ్రవరి 24 ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ మీద స్పెషల్ ఆపరేషన్ కోసం సైన్యాన్ని ఆదేశించాడు కానీ ఇమ్రాన్ మాత్రం ఇంకా అప్పటికి పుతిన్ తో సమావేశం అవలేదు కానీ విలేఖరులతో మాట్లాడుతూ పుతిన్ ఉక్రెయిన్ మీద దాడికి ఆదేశించడాన్ని నేను చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాను అంటూ చేసిన వ్యాఖ్య అంకుల్ శామ్ కి కోపం తెప్పించింది. దరిమిలా రష్యా పర్యటన ముగిసిన కొద్ది నెలలలోపే ఇమ్రాన్ తన ప్రధాని పదవిని కోల్పోయాడు. మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ ని ప్రశంసిస్తూ మోడీ ఆమెరికాని లెక్క చేయకుండా రష్యా నుంచి ఆయిల్ కొనడానికి నిర్ణయం తీసుకోవడం ఆపై పెట్రోల్ ,డీజిల్ ధరలని తగ్గించడం సాహసోపేతమయిన చర్య అంటూ తెగ పొగిడేశాడు. అయితే సైన్యానికి కానీ ISI కి కానీ ఇది జీర్ణించుకోలేని పరిణామం ! ఒక తాజా మాజీ పాకిస్థాన్ ప్రధాని భారత ప్రధానిని బహిరంగంగా పొగడడం అంటే అది పాకిస్థాన్ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు.
వారం క్రితం ఇమ్రాన్ ఖాన్ మరో అడుగు ముందుకు వేసి పాకిస్థాన్ మూడు దేశాలుగా విడిపోతుంది అంటూ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్ లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా పాకిస్థాన్ [బలూచిస్తాన్ – సింధ్ – పంజాబ్ ] మూడు ముక్కలు అవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే ఇమ్రాన్ హత్యకి కుట్ర పన్నడం అనే అంశం తెర మీదకి వచ్చింది. అయితే తన ప్రధానమంత్రి పదవి పోయిందని అక్కసుతో ఇమ్రాన్ ఈ వ్యాఖ్య చేశాడా ? కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్థాన్ లో పరిస్థితి ఇమ్రాన్ చెప్పినదానికి భిన్నంగా ఏమీ లేదు. తీవ్రమయిన విద్యుత్ కోతల తో పాటు ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలలో తీవ్ర అసంతృప్తిని కలుగచేస్తున్నాయన్నది వాస్తవమే !వీటికి తోడు వారం క్రితం పెట్రో ఉత్పత్తుల మీద సబ్సిడీ ని తీసివేయడం తో పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ ధరలు అమాంతమ్ పెరిగిపోవడం కూడా అగ్నికి ఆజ్యం తొడయినట్లు అయ్యింది.
IMF – అమెరికా !
ప్రస్తుతం పాకిస్థాన్ ఎదుర్కుంటున్న విదేశీ మారక ద్రవ్య లోటుని పూడ్చడానికి ఐఎంఎఫ్ తలుపు తట్టింది పాకిస్థాన్. కానీ ఐఎంఎఫ్ ముందు సబ్సిడీలని ఎత్తివేయాలని కోరింది. ఐఎంఎఫ్ కోరిక మేరకు ముందు పెట్రో ఉత్పత్తుల మీద సబ్సిడీని ఎత్తివేసింది పౌర ప్రభుత్వం [ఇంకా కొంత మిగిలే ఉంది ]. కానీ …. తాజాగా FATF గ్రే లిస్ట్ ని చూపించి ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ పాకేజీ ని ఇవ్వడానికి నిరాకరించింది.ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇస్తుందని సబ్సిడీలని ఎత్తివేసిన పాకిస్థాన్ కి ఇప్పుడు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లుఅయింది. అయితే దీనికి కారణం ఉంది. స్వదేశంలో వస్తున్న విమర్శల ఒత్తిడిని తగ్గించుకోవడానికి పాక్ ప్రభుత్వం రష్యా నుంచి చవకగా క్రూడ్ ఆయిల్ కొనడానికి సంప్రదింపులు మొదలు పెట్టగానే ఐఎంఎఫ్ అప్పు ఇవ్వడానికి నిరాకరించింది ! ఇది పరోక్షంగా గల్ఫ్ దేశాలని కూడా రెచ్చగొట్టినట్లు అయింది.
Imran Khan
నూపుర్ శర్మ వివాదం – పాకిస్థాన్ జిహాదీ ల యూరోపు లింకులు !
ఒక పక్క నూపుర్ శర్మ వివాదం మీద మన దేశంలో అల్లర్లు సృష్టించడానికి ₹కోట్ల రూపాయలు వెచ్చించిన పాకిస్తానీ ISI తాజాగా మళ్ళీ యూరోపులో అలజడులు సృష్టించే ప్రయత్నం లో ఉండగానే ఒక్కకరు పట్టుపడిపోతున్నారు. యూరోపు లోని మీడియా సంస్థల రిపోర్ట్ ప్రకారం ఒక్క ఇటలీ లోనే Agenzia Nazionale Stampa Associata (ANSA) అనే వార్తా సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇటలీ తో పాటు పలు యూరోపియన్ దేశాలలో మొత్తం 14 మంది పాకిస్తానీ దేశస్తులని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఇటలీ కి చెందిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఇటలీ లోని పలు స్థావరాల మీద దాడులు చేయగా పాకిస్తానీ స్లీపర్ సెల్ కి చెందిన వారు పట్టుపడ్డారు. ఇటలీ లో దొరికిన పాకిస్తానీ జాతీయులు ఇంటరాగేషన్ లో వెల్లడించిన వివరాల ప్రకారం పలు దేశాలలో సోదా చేయగా మరి కొంతమంది పాకిస్థాన్ జాతీయులు పట్టుబడ్డారు. వీళ్లందరూ ప్రస్తుతం భారత్ లో చేస్తున్న విధంగానే యూరోపులో కూడా విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
చార్లీ హెబ్దో వివాదం !
పాకిస్తానీ జాతీయుడు అయిన జహీర్ హాసన్ మహమ్మద్ [Zaheer Hassan Mahmoud] మొత్తం యూరోపు నెట్వర్క్ ని నడుపుతున్నాడు. ఇటలీ లో యాంటీ టెర్రర్ స్క్వాడ్ జరిపిన దాడుల్లో యూరోపులోని వివిధ నగరాలలో బాంబు దాడులకి వ్యూహం రచించి వాటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జహీర్ హాసన్ మహమ్మద్. కానీ ఇతను పట్టుపడడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు లేకపోతే పెద్ద విధ్వంసానికి పాల్పడే వాడు.
2015 లో చార్లీ హెబ్దో అనే కార్టూనిస్ట్ ఫ్రెంచ్ పత్రికలో ప్రొఫెట్ మహమ్మద్ మీద వేసిన కార్టూన్ ల వలన అప్పట్లో పారిస్ లో విధ్వంసానికి పాల్పడ్డారు రాడికల్ ముస్లిమ్స్. ఇది ఇలా ఉండగా FATF గ్రే లిస్ట్ నుండి తమని తప్పించమని దౌత్య పరమయిన ప్రయత్నాలు మొదలు పెట్టిన పాకిస్థాన్ కి తాజాగా ఇటలీ లో జిహాదీ టెర్రర్ నెట్వర్క్ సూత్రధారి పాకిస్థాన్ జాతీయుడు అయిన Zaheer Hassan Mahmoud పట్టుబడం తో పాకిస్థాన్ అభ్యర్ధనని FATF బహుశా పట్టించుకొకపోవచ్చు. ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల వెనుక పాకిస్థాన్ సైన్యం, ISI ల చర్యలు కారణం అయిఉండవచ్చు. నిజమే ఇప్పుడు పాకిస్థాన్ ఉన్న పరిస్థితి లో ఎవరూ జోక్యం చేసుకోకుండానే మూడు ముక్కలు అవడం ఖాయం కాకపోతే అది ఎప్పుడు జరుగేది అన్నదే ప్రశ్న. బహుశా ఇమ్రాన్ ఖాన్ హత్య జరగవచ్చు !