Jasprit Bumrah: జస్ ప్రీత్ బుమ్రా.. అతని వేగానికి కొలమానం ఉండదు. అతని బంతికి అదుపు ఉండదు. యార్కర్ సంధించి వికెట్ పడగొడతాడు. హాఫ్ సైడ్ బంతులు వేస్తూ వికెట్లను నేలకూల్చుతాడు. ఇక్కడ బంతులు వేయడం కామన్ కాదు.. వికెట్లు పడగొట్టడం కామన్.. అందువల్లే బుమ్రా ఆధునిక క్రికెట్లో పెను సంచలనాలు సృష్టిస్తున్నాడు. గొప్ప గొప్ప బౌలర్ల వల్ల కూడా కానిది తను చేసి చూపిస్తున్నాడు.
టీమిండియా పేసుగుర్రం లాగా పేరుపొందిన బుమ్రా ఇప్పటివరకు ఎన్నో రికార్డులు సాధించాడు. మరెన్నో ఘనతలు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో అరుదైన చరిత్రకు దగ్గరగా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన ఒకే ఒక్క బౌలర్ గా అతడు చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాడు. అడిలైడ్ టెస్టులో ఉస్మాన్ ఖవాజాను అవుట్ చేసి ఈ ఏడాది టెస్టులలో 50 వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ గా బుమ్రా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే శనివారం రెండవ రోజు మెక్ స్వీనే, స్మిత్ వికెట్లను పడగొట్టిన బుమ్రా అరుదైన ఫీట్ నమోదు చేశాడు. మొత్తంగా ఈ ఏడాది టెస్టులలో 52 వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ గా ఆవిర్భవించాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్ట్ ఫార్మేట్ లో 50 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడవ భారతీయ బౌలర్ గా బుమ్రా రికార్డ్ సెట్ చేశాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ ఈ ఘనతను గతంలో నమోదు చేశారు. 1979లో కపిల్ దేవ్ ఒకే క్యాలెండర్ ఇయర్ లో 74 వికెట్లు సాధించాడు. 1983లో ఒకే క్యాలెండర్ ఇయర్ లో 75 వికెట్లు నేల కూల్చాడు. 2002లో జహీర్ ఖాన్ 51 వికెట్లు సాధించాడు. ఆ తర్వాత 22 సంవత్సరాలకు బుమ్రా ఈ రికార్డును సాధించాడు..
దిగ్గజాల సరసన
కపిల్ దేవ్, జహీర్ ఖాన్ లాంటి దిగ్గజ బౌలర్లు సృష్టించిన రికార్డుకు బుమ్రా సమానంగా వచ్చాడు. అయితే ఇక్కడ మరో ఘనతని కూడా అతడు అందుకున్నాడు. 2019 తర్వాత ఏ ఫాస్ట్ బౌలర్ కూడా ఒక క్యాలెండర్ ఇయర్ లో పడగొట్టలేని వికెట్లను బుమ్రా సాధించాడు. 2019లో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ 50 కంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు మరే ఫాస్ట్ బౌలర్ కూడా ఆ రికార్డు సృష్టించలేకపోయాడు. అయితే ఇప్పుడు దానిని బుమ్రా అధిగమించాడు. పేరు ఫీట్ అందుకొని వారెవ్వా అనిపిస్తున్నాడు.” పెర్త్ టెస్టులో సంచలనం సృష్టించావు. అడిలైడ్ లో ఇప్పటికే మూడు వికెట్లు నీ ఖాతాలో వేసుకున్నావ్. ఇంకా ఐదు మ్యాచ్లు జరగాల్సి ఉంది. ఎన్ని అద్భుతాలు చేస్తావో మా ఊహకే అందడం లేదు. చూస్తుంటే కపిల్ దేవ్ రికార్డు కూడా బద్దలు కొట్టే లాగా ఉన్నావ్. నీ బౌలింగ్ లో ఆడాలంటే భయమే కాదు.. వెన్నులో వణుకు కూడా పుడుతోంది. సాహో బుమ్రా భాయ్.. మరో ఐసిసి అవార్డు నీ కోసం ఎదురుచూస్తోంది అని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Birthday boy #JaspritBumrah becomes the third Indian fast bowler, after Kapil Dev and Zaheer Khan, to pick up 50 Test wickets in a calendar year #BGT2024 #AUSvIND #TeamIndia pic.twitter.com/8POShSJ5vH
— Circle of Cricket (@circleofcricket) December 6, 2024