కరోనా వైరస్ సోకి మాజీ క్రికెటర్ మంగళవారం మృతిచెందాడు. పాక్ మాజీ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్(50)కు ఈనెల 7న కరోనా సోకింది. దీంతో అతడిని ఆసుప్రతిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. గడిచిన మూడురోజులుగా అతడిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తుండగా మంగళారం పరిస్థితి విషమించడంతో సర్ఫరాజ్ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
సర్ఫరాజ్ 1988-94 మధ్యకాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌గా క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 15ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 616పరుగులు చేశాడు. 1994లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం కోచ్ అవతారమెత్తాడు. సర్ఫరాజ్ సోదరుడు అక్తర్ సర్ఫరాజ్ కూడా క్రికెటరే. పాక్ తరఫున అక్తర్ నాలుగు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి 1998లో విడ్కోలు తీసుకున్నాడు.
కాగా పాకిస్తాన్ కు చెందిన స్వ్కాష్ ప్లేయర్ అజామ్ ఖాన్(95) కరోనాతో ఇటీవల మృతిచెందాడు. 1959-62కాలంలో వరుసగా నాలుగు బ్రిటీష్ ఓపెన్ టైటిల్స్ గెలుపొందాడు. మార్చిలో కరోనా బారిన అజామ్ లండన్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. పాకిస్తాన్లో ఇప్పటికే కరోనా కేసులు 5వేలకు చేరుకోగా 96మృతిచెందారు.