https://oktelugu.com/

బోల్డ్ పాత్రలో కనిపించనున్న ‘శివగామి’

ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు కేరాఫ్ గా రమ్యకృష్ణ నిలిచింది. గ్లామర్ పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలళయాం, బాలీవుడ్ సీని ప్రేక్షకులను రమ్యకృష్ణ అలరించింది. కాగా వివాహం చేసుకున్న కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి కేవలం క్యారక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది. అయితే రాజమౌళి తెరకెక్కించిన ‘బహుబలి’ సినిమాలో రమ్యకృష్ణ నటించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. శివగామి పాత్రలో ఆమెను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 14, 2020 / 03:13 PM IST
    Follow us on


    ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు కేరాఫ్ గా రమ్యకృష్ణ నిలిచింది. గ్లామర్ పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలళయాం, బాలీవుడ్ సీని ప్రేక్షకులను రమ్యకృష్ణ అలరించింది. కాగా వివాహం చేసుకున్న కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి కేవలం క్యారక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది.

    అయితే రాజమౌళి తెరకెక్కించిన ‘బహుబలి’ సినిమాలో రమ్యకృష్ణ నటించి అందరిచేత శభాష్ అనిపించుకుంది. శివగామి పాత్రలో ఆమెను తప్ప వేరేవరు చేయలేరు అన్న రీతిలో రమ్యకృష్ణ ఆ క్యారెక్టర్లో జీవించింది. దీంతో ఈ సినిమా తర్వాత ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలకే మొగ్గుచూపుతుంది. తాజాగా ఆమె ‘అంధాధున్’ రీమేక్లో నటించనుందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీని ఠాగూర్ నిర్మిస్తుండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.

    నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ బోల్డ్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో టబు నటించిన పాత్రలో తెలుగులో రమ్యకృష్ణ నటించనుందట. ఇందుకోసం రమ్యకృష్ణ భారీగా డిమాండ్ చేయగా ఆమె అడినంత ఇచ్చేందుకు దర్శక, నిర్మాతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ‘అంధాధున్’లో నటించిన టబునే రీమేక్ మూవీలో నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆమె పారితోషకం భారీగా డిమాండ్ చేయగా ఈ పాత్రలో అనసూయను తీసుకున్నట్లు టాక్ విన్పించింది.

    తాజాగా ఈ పాత్రలో అనసూయ బదులుగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓకే అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రమ్యకృష్ణ తన భర్త కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ మూవీలో నటిస్తోంది.