CM Jagan- Rajya Sabha Candidates: దశాబ్దాలుగా హైదరాబాద్ లో స్థిరపడిన వారు ప్రత్యక్ష ఎన్నికల్లో తలబడి పదవులు సాధించారు. అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయితే ఆంధ్ర విషయంలో మాత్రం అందుకు విరుద్దం. తెలంగాణకు చెందిన వారు పదుల సంఖ్యలో ఏపీ ప్రభుత్వంలో కీలక పదవులు పొందారు. అది కూడా నామినేటెడ్ ప్రాతిపదికనే. గత ఎన్నికల్లో తనకు మేలు చేశారనో.. తన సాక్షి మీడియాకు అదనపు భారంగా మిగులుతున్నారని ఏమో కానీ చాలామందికి ప్రభుత్వంలో రకరకాల పదవులు స్రుష్టించి మరీ కట్టబెట్టారు. ఇప్పుడు కీలకమైన రాజ్యసభ పదవులు సైతం తెలంగాణ వారికే కట్టబెట్టారు.
తాజాగా తన వ్యక్తిగత లాయర్ నిరంజన్ రెడ్డి, బీసీ నేత క్రిష్ణయ్యకు పదవులిచ్చారు. వీరిద్దరూ తెలంగాణ వారే. దీంతో ఇప్పుడు జగన్ వ్యవహార శైలి, తెలంగాణ వారికి ఇస్తున్న ప్రాధాన్యం అంతటా చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వాళ్ల పెత్తనమేంటి ? అనే చర్చ ఇప్పుడు ఏపీలో ఊపందుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ పదవి భర్తీ చేసినా.. అందులో తెలంగాణ కోటా నడుస్తోంది. దానికి రకరకాల సమీకరణాల పేరుతో సరిపెట్టుకోవడం వైసీపీ అధిష్టానం అలవాటు చేసుకుంది. తాజా రాజ్యసభ ఎంపికను కూడా బీసీ కలరింగ్ వేసింది. తన ఎంపికను రాజకీయ కోణంలో చూడవద్దని క్రిష్ణయ్య కోరారంటే దానిని ఏమని అర్ధం చేసుకోవాలి. తాను బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి క్రుషి చేసినందున, సీఎం గుర్తించి పదవి కట్టబెట్టారని సైతం ఆయన ప్రకటించుకున్నారు. కుల సంఘాల నాయకులకు ప్రాంతీయవాదం లేదని చెప్పుకొచ్చారు. అట్లాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో నామినెటేడ్ పదవుల్లో కొలువుదీరిన ఒక్క ఏపీ నాయకుడు ఉన్నాడా? అంటే మచ్చుకైనా కనిపించరు.
Also Read: Break To Gadapa Gadapa: ‘గడపగడప’కూ విమర్శలు… వదిలేస్తున్న మంత్రులు
ఏపీ ప్రజలకు విరుద్ధంగా..
ఏపీ ప్రజలు అధికారం ఇవ్వబట్టే కదా జగన్ కు పదవులిచ్చే చాన్స్ దక్కింది. అటువంటిది ఏపీ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా తెలంగాణ వారికి పదవులు ఎలా ఇస్తారన్నదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. చివరకు సొంత పార్టీలో కూడా ఇదో అసంత్రుప్త అంశంగా మారిపోయింది. ఒక వేళ బీసీలకు రాజ్యసభకు పంపాలనుకుంటే.. ఏపీలో బీసీల్లేరా అనే వాదన వినిపిస్తోంది. రెండు రాజ్యసభ స్థానాలను తెలంగాణకు ఇవ్వడం ఒక్కటే కాదు.. గతంలో ఇచ్చిన పదవుల విషయాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల మంత్రివర్గాన్ని జగన్ విస్తరిస్తే… తెలంగాణకు చెందిన విడదల రజనీకి కీలకమైన శాఖను కేటాయించారు. విడదల రజనీ అచ్చ తెలంగాణ వ్యక్తి. ఆమెకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినప్పుడే స్థానికత అంశం తెరపైకి వచ్చింది. కానీ జగన్ మేనియాలో అంతా కొట్టుకుపోయింది. ఇక సలహాదారుల్లో సింహభాగం తెలంగాణ వారే. పని లేదని రాజీనామా చేసిన కొండుభట్ల రామచంద్రమూర్తి దగ్గర నుంచి దేవులపల్లి అమర్ వరకూ చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ దగ్గర నుంచి సలహాదారుల వరకూ.. చాలా మందిని తెలంగాణ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఐటీ సలహాదారుల్లో ఇద్దరు తెలంగాణ వాసులు. ఏపీ సెక్రటేరియట్‌కు వెళ్తే సాక్షి మీడియాలో పని చేసేవారే దర్శనమిస్తారు. కేసీఆర్ మీద కోపంతో ముందే రిటైర్మెంట్ తీసుకున్న ఓ ఐపీఎస్ అధికారికి జగన్ విద్యాశాఖ సలహాదారు పదవి ఇచ్చారు. మరో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తెలంగాణకు చెందినవారే. ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు.
అంతా కులం కలరింగ్..
జగన్ బయటకు పఠిస్తోంది బీసీ మంత్రం కానీ.. అంతా తంత్రమేనని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. దానికి కూడా కులం కలరింగే ఇస్తున్నారు. రాజకీయంగా ఏది చేసుకున్నా ఆయనిష్టం. మైలేజ్ వస్తే లబ్ధి పొందుతారు. భూమరాంగ్ అయితే నష్టపోతారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా రాజకీయంగా ఆలోచిస్తే మాత్రం చరిత్రహీనులవుతారు. ఏదో ఓ సారి.. రెండు సార్లు అయితే ఏదో ఒకటి అనుకోవచ్చు. కానీ ప్రతీ సారి తెలంగాణ వారికే పదవులు కట్టబెడుతుండడంతో ఇప్పుడిప్పుడే ఏపీలో చర్చ ప్రారంభమవుతోంది. కొన్ని ప్రజాసంఘాలు నిరసనలు కూడా ప్రారంభించాయి. పోనీ నామినేట్ పదవులు తీసుకున్న వారంతా సరిహద్దు జల వివాదాల గురించి మాట్లాడతారా? సమస్యకు పరిష్కారమార్గం చూపేవారా? అంటే అదీ లేదు. అటువంటప్పుడు జగన్ వారికి ఎందుకు ప్రాదాన్యిమిస్తున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ వ్యవహార శైలి మున్ముందు ఆయనకు కొత్త తలనొప్పులు తేవడం ఖాయం. ఇప్పుడిప్పుడే బీసీలు రోడ్డోక్కుతున్నారు. జగన్ ఏపీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. బీసీ సెంటిమెంట్ కాస్తా.. రాష్ట్ర సెంటిమెంట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read:BJP Focus On Telangana: తెలంగాణపై బీజేపీ దండయాత్ర.. అగ్రనేతల రాకకు కారణమేంటి?
Recommended Videos