Homeఆంధ్రప్రదేశ్‌Pilgrimages: చనిపోయేలోపు చూడాల్సిన ఈ ఐదు పుణ్యక్షేత్రాలివీ

Pilgrimages: చనిపోయేలోపు చూడాల్సిన ఈ ఐదు పుణ్యక్షేత్రాలివీ

Pilgrimages: ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. ఎన్నో కష్టాలు, నష్టాల మధ్య సాగుతున్న ఈ ప్రపంచంలో ఆలయాలు, ప్రార్థన మందిరాలకు వెళితే మనసు ప్రశాంతంగా మారుతుంది. భారతదేశంలో పురాతన కాలం నుంచి ఆలయాలను నిర్మించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు పాలకులు. గుళ్లు తిరగడం వల్ల మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా పుణ్యఫలం వస్తుందని కొందరు ఆధ్యాత్మిక గురువులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏపీలోని ఈ పుణ్య క్షేత్రాలను కచ్చితంగా చూసి తరించాలని అంటున్నారు. చనిపోయే లోపు ఈ క్షేత్రాలను దర్శిస్తే ఎన్నో జన్మల పుణ్యం వస్తుందని అంటున్నారు. ఆ క్షేత్రాలు ఏంటి? వాటి విశిష్టతల గురించి తెలుసుకుందాం.

-అమరావతి శివాలయం:

Pilgrimages
Sri Amareswara Swamy

ఏపీలోని పల్నాడు జిల్లా అమరావతిలో ప్రసిద్ధ శివాలయం ఉంది. ఆంధ్రప్రదేశ్ పంచారమాలలో ఇది ఒకటి. ఈ ఆలయంలో శివలింగాన్ని ఇంద్రుడు పత్రిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించి అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్లు చెబుతున్నారు. గుంటూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కనిపిస్తుంది. విజయవాడ, మంగళగిరి నుంచి కూడా ఇక్కడికి వెళ్లొచ్చు.

Also Read: CM Jagan- Rajya Sabha Candidates: జగన్ నిర్ణయాలతో బీసీలు కాదు.. ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమం వచ్చేటట్లు ఉందే..

-కోటప్పకొండ:

Pilgrimages
Kotappakonda

పల్నాడు జిల్లాలోని మరో ప్రసిద్ధ క్షేత్రం కోటప్పకొండ. కేలాశాధినేత అయిన మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిది ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతీ ఏటా కార్తీక మకాసంలో కోటప్పకొండ తిరుణాళ్లు, కార్తీక వన సమారాధనలు జరుగుతాయి. ఈ ఆలయంలో క్రీస్తుశకం 1172 లో గోళరాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని పాలించిన రాజులలో శ్రీకృష్ణ దేవరాయులు ఈ ఆలయానికి భూదానం చేశాడట. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. కోటప్పకొండకు నరసరావుపేట నుంచి ప్రతీ అరగంటకు ఓ బస్సు ఉంటుంది. అలాగే విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే వాళ్లు చిలకలూరిపేట మీదుగా చేరుకోవచ్చు.

-పెదకాకాని

Pilgrimages
Sri Malleswara Swamy

ఆంధ్రప్రదేశ్లోని శివాలయాల్లో పెదకాకాని మల్లేశ్వరస్వామికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈఆలయంలో శ్రీశైలం లింగాంశం కలిగి ఉండడంతో ద్వాదశ జ్యోతిర్గింగాలలలో మహిమ ఇందులోనూ ఉన్నట్లే. మహర్షలోని అత్యంత ప్రసిద్ధి చెందిన భరద్వాజ మహాముని ఒకప్పుడు అన్ని తీర్థాలు సేవిస్తూ భూ ప్రదక్షిణలు చేస్తూ ఈ క్షేత్రానికి వచ్చాడు. స్వామిని అభిషేకిస్తున్న సమయంలో శివానుగ్రహం వలన యజ్ఓ సంకల్పం కలిగింది. మహర్షికి సమస్త సంభారాలను సమకూర్చి ఎందరో మహర్షులను ఆహ్వానించి ప్రారంభించారు. అక్కడికి ఒక కాకి వచ్చి మనుష్య భాషలో తాను కాకాసురుడనే రాక్షసుడని, బ్రహ్మదేవుడి వరం వలలన తనకు హవిర్భాగాలను స్వీకరించే అర్హత దక్కిందని, నీ యజ్ఒం సఫలం కావాలంటే నన్ను అభిషేకించాలని కోరుతుంది. ఆ తరువా మహర్షి యజ్ం నీళ్లు కాకిపై చల్లగానే శ్వేతవర్ణంలోకి మారిపోతుంది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని గ్రామంలో ఈ శివాలయం ఉంది. ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.

శృంగేరీ శారదా పీఠం:

sringeri sharada peetham
sringeri sharada peetham

ప్రముఖమైన హిందూ అద్వైత పీఠాలలో శృంగేరీ శారదా పీఠం ఒకటి. శంకర మఠాలక పీఠాధిపతులను ఆదిశంకరాచార్యులుగా పరిగణిస్తారు. విద్యారణ్యుని గౌరవార్థం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాజధాని నగరానికి విద్యానగరం అని పేరు పెట్టారు. క్రమంగా ఈనగరానికి విజయనగరం పేరు వచ్చింది. 1782 నుంచి 1799 వరకు శ్రీరంగ పట్నాన్ని రాజధానిగా చేసుకొని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లింపాలకులు హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్లకు శృంగేరి శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వచ్చి రాజ్యంపై పడినప్పుడు శృంగేరీ మీద దాడి చేసిన పీఠాన్ని దోచుకున్నారు. శృంగేరీ పీఠానికి 120 పైగా శాఖలు భారతేశమంతా విస్తరించి ఉన్నాయి.

ఇలా ఏపీలోని ఈ ఐదు దివ్యక్షేత్రాలు ఎంతో పవిత్రమైనవి.. పవర్ ఫుల్ అయినవి. వీటి చరిత్ర బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోవడంతో జనాల రాక మందగించింది. ఈ పురాతన క్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే జన్మజన్మల భాగ్యం అని చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏపీలోని ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించేందుకు సమాయత్తం కండి.

Also Read:Break To Gadapa Gadapa: ‘గడపగడప’కూ విమర్శలు… వదిలేస్తున్న మంత్రులు
Recommended Videos
రాజ్యసభకు ఇద్దరు ఆంధ్రా, ఇద్దరు తెలంగాణా వాళ్ళతో బాలన్స్ || Analysis on AP Rajya Sabha Candidates
మొగులయ్య సెన్సేషనల్ వీడియో || Kinnera Mogulaiah Sensational Comments || Ok Telugu
ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ బిందెలతో చుట్టుముట్టిన మహిళలు || Villagers Angry on Raptadu YCP MLA

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version