మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా గుంటూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ కార్యాలయం గురించి వివాదం కొనసాగుతుండగా తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆళ్ల ఈ పిటిషన్ లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కార్యాలయం నిర్మాణం కోసం అక్రమంగా భూమిని కేటాయించిందని… నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపిన కేటాయింపుల గురించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు
ఆత్మకూరు పరిధిలో ఉన్న 3 ఎకరాల 65 సెంట్ల భూమిని కేటాయిస్తూ 2017 సంవత్సరం జూన్ నెల 22వ తేదీన జారీ చేసిన 228ని సవాల్ చేస్తూ ఆళ్ల తరపు లాయర్ పిటిషన్ ను దాఖలు చేశారు. 2014 – 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ఆత్మకూరులో కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన భూమిని కేటాయించిందని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు ఏ విధంగా అనుమతి ఇచ్చారని పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఈ విధంగా భూమిని కేటాయించడం సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్దేశించిన చట్ట సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. నీటి వనరులు, వాటితో సంబంధం ఉన్న భూములు కేటాయించడంపై నిషేధం అమలులో ఉన్నా నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఏపీ పంచాయతీ రాజ్ చట్టం–1994లోని నిబంధనలకు విరుద్ధంగా భూములను కేటాయించారని… భవన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినందున తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు.
Also Read : జగన్ ‘ఆపరేషన్ వైజాగ్’ పై ఉక్కుపాదం మోపిన హైకోర్టు..!