ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. నిన్న ఒక్కరోజే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ ఏడిటి పై సర్కారు వారికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ మరొక ఆదేశం జారీ చేసింది. పరిపాలనా రాజధాని వైజాగ్ తరలింపు ప్రక్రియ హైకోర్టు తీవ్రమైన వ్యతిరేకతను కనబరిచింది.
Also Read : చంద్రబాబుకు కొత్త సమస్య…. సుప్రీంలో అళ్ల స్పెషల్ లీవ్ పిటిషన్….?
నిన్ననే సర్కారు వారి గెస్ట్ హౌస్ పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన హైకోర్టు అసలు తామిచ్చిన స్టేటస్ కో అమలులో ఉన్నప్పుడు విశాఖలో చిన్న ఇటుక ముక్కను కూడా కదల్చకూడదు అని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పుడు ‘బిల్డ్ ఏపీ’ పేరుతో విశాఖలో అమ్మదలుచుకున్న భూములపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఆరు స్థలాల్లో రెండు స్థలాల విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది.
ఇప్పటికే తమ వద్ద విచారణలో ఉన్న పిటిషన్లపై ఒక నిర్ణయం వెలువడే దాకా విశాఖలో ఎటువంటి భూములు అమ్మకూడదు అని తేల్చి చెప్పిన హైకోర్టు ఎప్పుడు స్టే ఇచ్చిన స్థలాలలో చినగదిలి మండలం లోని జిల్లా ట్రైనింగ్ సెంటర్ లో 75 సెంట్లు స్థలం, ఏఆర్ పోలీస్ క్వార్టర్స్ లో ఎకరం స్థలం ఉన్నాయి. హైకోర్టులో గురువారం ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ‘బిల్డ్ ఏపీ పేరుతో’ ప్రభుత్వం అమ్మాలనుకున్న స్థలాలపై స్టే విధించింది. అగనంపూడి లో భూముల విక్రయం పైన కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
అంతేకాకుండా గుంటూరు విశాఖ జిల్లాలోని కొన్ని భూములను ‘ఈ-వేలం’ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న దశలో దీనిపై కూడా పిటిషన్ల పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఇటువంటి భూములను మార్కెట్ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు విక్రయించాలని భావించింది. దీని ద్వారా ఎంత లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని వారి ఆలోచన అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ భూముల అమ్మకం సరికాదని వాదనలు వినిపిస్తున్న దశలో ఇన్ని చేసిన హైకోర్టు వారు దానిపై కూడా స్టే విధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
Also Read : ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు