TTD JEO Dharma Reddy: వడ్డించే వాడు మనవాడైతే..కడబంతిలో ఉన్నా నిండుగా ఆహారం దొరుకుతుందంటారు. అది వైసీపీ ప్రభుత్వంలో అతికినట్టు సరిపోతోంది. ప్రస్తుత జగన్ సర్కారులో కులానికి మంచి ఆదరణే ఉంది. అందునా ఆయన సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేశారు. పేరుకే మంత్రులు కానీ.. వారిపై సూపర్ బాసులుగా తనవాళ్లనే నియమించారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలను నలుగురు పెద్దరెడ్లకు అప్పగించారు. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అన్ని విభాగాల అధిపతుల వరకూ రాష్ట్రమంతా సర్దేశారు. ఇప్పుడు టీటీడీని సైతం తనవారితో నింపేస్తున్నారు. టీడీపీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తుండగా.. ఈవోగా జవహార్ రెడ్డి, జేఈవోగా ధర్మారెడ్డి ఉన్నారు. జవహార్ రెడ్డి పూర్తిస్థాయిలో సీఎంవోకు వెళ్లిపోగా.. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ధర్మారెడ్డికే ఇన్ చార్జి జేఈవోగా బాద్యతలు అప్పగించారు. ఇక్కడే ఒక ట్విస్ట్, శనివారంతో ధర్మారెడ్డి పదవీ కాలం ముగిసిపోతోంది. ఇన్నాళ్లూ ఆయన డిప్యూటేషన్ పై ఉన్నారు. కేంద్ర రక్షణశాఖ ఉద్యోగి అయిన ధర్మారెడ్డిని డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకు వచ్చి టీటీడీ జేఈవోగా నియమించారు. ఇటీవల వరకూ ఈవోగా జవహర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడాయని పూర్తి స్థాయిలో సీఎంవోకు వెళ్లారు. దీంతో జేఈవో ధర్మారెడ్డికే ఈవోగా అదనపు చార్జ్ ఇచ్చారు. మే 14 అంటే శనివారంతో డిప్యూటేషన్ ముగిసిపోతుంది. తర్వాత కేంద్ర రక్షణశాఖలో రిపోర్ట్ చేయాలి. కానీ ఆయనను ఇక్కడే ఉంచాలని.. డిప్యూటేషన్ పొడిగించాలని ఏపీ ప్రభుత్వం అదే పనిగా కేంద్రానికి విజ్ఞుప్తులు చేస్తోంది.
పీఎంవోలో ఫైల్..
టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోసం ఎక్కడిదాకైనా వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన రెడ్డి కాబట్టి ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వంలో కొలువు ఉండేట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆయన డిప్యూటేషన్ పొడిగింపు ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయంలో ఉంది. ఆయన అంగీకరించకపోయినా… అంగీకరించడం ఆలస్యం అయినా ధర్మారెడ్డి టీటీడీ నుంచి వైదొలగాలి. ఒక వేళ పీఎంవోలో అభ్యంతరం వ్యక్తం అయితే్.. అవసరమైతే ధర్మారెడ్డిని కేంద్ర సర్వీసులకు రాజీనామా చేయించి రాష్ట్రంలో ఐఏఎస్ హోదా ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ ఉత్తరాది రాష్ట్రంలో ఇలా చేశారని ఓ కేస్ స్టడీని ఇప్పటికే బయటకు తీశారు. ఆ ప్రకారం.. తాము చేయాలని అనుకుంటున్నారు . ధర్మారెడ్డికి ఇంకా రెండేళ్లకుపైగా సర్వీస్ ఉంది. అంటే వైసీపీ సర్కార్ ఉన్నంత కాలం ఆయన ఈవోగా ఉంటారు. అందుకే… పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారని అంటున్నారు.
Also Read: Srilnka: శ్రీలంకలా మన పరిస్థితి దిగజారుతుందా? ప్రస్తుత పరిస్థితేంటి?
అంతా అస్పష్టత
ధర్మారెడ్డి కేంద్ర సర్వీసుల ఉద్యోగి, ఆయన అక్కడ రాజీనామా చేస్తే ఏపీ క్యాడర్‌కు ఎలా వస్తారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఐపీఎస్, ఐఏఎస్‌లు అయితే రాష్ట్ర క్యాడర్ ఉంటుంది. రక్షణ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర క్యాడర్ ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు. ఎలాగైనా ధర్మారెడ్డిని టీటీడీలోనే ఉంచాలని ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తోంది. రెడ్డి కోసం ఇంత పట్టుదలకు పోవడం చాలా సార్లు జరిగిందని .. ఇదంతా సహజమేనని ప్రభుత్వ వర్గాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని శాఖలో కుల జాడ్యం పెరిగింది. పోనీ రాయలసీమ వరకూ ఉందంటే ఒకలా అనుకోవచ్చు. కానీ ఉత్తరాంధ్రలో సైతం రెడ్డి అధికారులు, డీఎస్పీలను నియమించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికలు ద్రుష్టిలో పెట్టుకోనేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read: Thaman Comments: వాగ్లేవీ ఏలేస్తోంది.. తమన్ కామెంట్స్ కి కారణం మహేషే !