NTR Acting: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో వచ్చిన భారీ క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. స్నేహానికి ప్రాణమిచ్చే పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంది. అమాయకత్వంతో కూడిన విప్లవ వీరుడు భీమ్ పాత్రలో తారక్ ఒదిగిపోయారు. తన నటనతో ఎన్టీఆర్ అబ్బురపరిచారు. అసలు, ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ నటనకు ముగ్ధులు కాని వారు లేరు.
ఈ నేపథ్యంలోనే కళాతపస్వి విశ్వనాధ్ గారు ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ నటనకు ఆయన స్పెల్ బౌండ్ అయ్యి, ఎమోషనల్ అయ్యారట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కు స్వయంగా ఫోన్ చేసి కూడా ఆయన చెప్పారట. విశ్వనాధ్ గారికి తొందరగా ఎవరి నటన అంత తొందరగా నచ్చదు. కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడి నటన విషయంలోనే విశ్వనాధ్ గారు పెద్దగా ఎగ్జైట్ అయ్యేవారు కాదు.
అలాంటది, ఎన్టీఆర్ నటనకు ఆయన ఫిదా అయ్యారు. అంటే.. ఎన్టీఆర్ నటన అంత గొప్పగా ఉందని అర్ధం. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ నటనను అమితంగా ప్రశంసిస్తూ ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. కథను బట్టి ఎన్టీఆర్ విలక్షణమైన వాటర్ లాగా ఫీల్ అవుతూ ఉత్తమమైన నటనను కనబర్చాడు. తన అభినయంతో ప్రేక్షక హృదయాలను ఆకట్టుకున్నారు.
Also Read: Naga Chaitanya Thank You: జూలై 8న ‘థాంక్యూ’.. చైతు కొత్తగా ట్రై చేశాడు !
‘కొమురం భీముడో’ పాటలో ఎన్టీఆర్ నటనకు అభిమానులు మురిసిపోతున్నారు. ఇక నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. ఎన్టీఆర్ – చరణ్ లు సరికొత్త రికార్డులను సెట్ చేచేశారు.
ఏది ఏమైనా ఎన్టీఆర్ ఈ సినిమా కోసం దాదాపు నాలుగేళ్ల సమయాన్ని పెట్టాడు. అందుకే ఫ్యాన్స్ తో పాటు నందమూరి ఫాలోవర్స్ కూడా ఈ సినిమాపై ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, తీరా సినిమా విడుదలైన తర్వాత చూస్తే.. ఆశించిన స్థాయిలో ఎన్టీఆర్ ట్రాక్ లేదు. ఈ విషయంలోనే చాలా మంది ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఎన్టీఆర్ నటనకు గొప్ప పేరు వస్తోంది.
Also Read: Vijayanagaram District: ఆ జిల్లాలో అధికార పార్టీకి షాకిస్తున్న నేతలు.. ఎందుకలా?