YS Sharmila- Minister Niranjan Reddy: తెలంగాణ రాజకీయాలు.. రాజకీయ నేతల మాటలు.. భూతులు రోత పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ నాయకుల మాటల్లో అసభ్య పదజాలం పెరుగుతోంది. రాజకీలు అంటే ఒప్పుడు ఎన్నికల సమయంలోనే ఉండేవి. తర్వాత అంతా కలిసి పనిచేసేవారు. సమస్యలపై అధికార ప్రతిపక్షాలు చర్చించి నిర్ణయాలు తీసుకునేవి. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింతగా దిగజారిపోతున్నాయి. మాట్లాడలేని భాష, రాయలేని పదాలను సైతం నేతలు వాడుతున్నారు. అధికారంలో, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూడా తమ స్థాయిని మరిచి నీచంగా మాట్లాడుతున్నారు. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్.షర్మిల తెలంగాణ మంత్రి నిరంజన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల ప్రభుత్వ పనితీరుపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

మరదలు అన్న మంత్రి.. నిప్పులు చెరిగిన షర్మిల..
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సొంత నియోజకవర్గం వనపర్తిలో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. మంగళవారం షర్మిల అదే నియోజకవర్గంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. దీనిని ఉద్దేశించి మంత్రి షర్మిల మంగళవారం మరదలు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన షర్మిల మంత్రిపై ఒరేంజ్‌లో నిప్పులు చెరిగారు. ‘ఎవడ్రా నీకు మరదలు’ అంటూ మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడు మంత్రి నిరంజన్‌రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మెట్టు దెబ్బలు పడుతయ్.. మేం చేస్తున్న పోరాటంలో నీకు మరదలు కనిపించిందా?’ అంటూ నిరంజన్‌రెడ్డిని నిలదీశారు. ‘అసలు ఎవడ్రా నువ్వు’ అంటూ మంత్రి నిరంజన్‌రెడ్డిపై రెచ్చిపోయిన షర్మిల సిగ్గు ఉండాలి అంటూ ధ్వజమెత్తారు. ‘వీధి కుక్కకు నీకు తేడా లేదు’ అంటూ తీవ్రంగా తిట్టిపోశారు.
Also Read: KCR PM Candidate: అప్పుడే కేసీఆర్ ప్రధాని.. అంతే తగ్గేదేలేదట.. నవ్వుతున్నారు స్వామీ?
ప్రాజెక్ట్ పూర్తి చేయలేని దద్దమ్మ..
జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చెయ్యలేని దద్దమ్మ..
యువత హమాలీ పని చేసుకోవాలని, రైతులు వరి వేసుకోవద్దని చెప్పే వాడు ఒక మంత్రా? అని శర్మిల ప్రశ్నించారు. పేరుకు మాత్రమే నీళ్ల నిరంజన్‌రెడ్డి కానీ ప్రజలకు మిగిల్చింది మాత్రం కన్నీళ్లే అంటూ నిరంజన్‌రెడ్డి తీరును తూర్పారబట్టారు. మంత్రి హోదాలో ఉండి, కనీసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేని దద్దమ్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఏమీ లేని ఈ మంత్రి కేసీఆర్‌లాగానే వేల కోట్లు సంపాదించాడట. ఫాంహౌజ్ లు కట్టుకున్నాడట అంటూ తనదైన శైలిలో ఆరోపణలు చేశారు.

ఓట్లు కోసం వస్తే కర్రు కాల్చి వాత పెట్టండి
ప్రజాప్రస్థానం పాదయాత్రలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా షర్మిల నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని, సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనతో సమస్యలు లేని గ్రామం లేదని.. బాధలు లేని ఇల్లు లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సారి ఓట్లు అడగడానికి వచ్చే టీఆర్‌ఎస్ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలకు సూచించారు. ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోండి. అవి కమీషన్ల రూపంలో దోచుకున్న ప్రజల డబ్బే అని పేర్కొన్నారు. ఓటు మాత్రం మీకు సేవ చేసే వారికే వేయాలి అని సూచించారు. మొత్తంగా నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలకు ప్రతిగా మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఆయనై అంతకంటే ఎక్కువ ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
[…] Also Read: YS Sharmila- Minister Niranjan Reddy: వైఎస్ షర్మిల మరదలు అట..… […]