Kerala- Electric Scooter: చదువు రాకముందు కాకరకాయ అని చదువుకున్నాక కీకరకాయ అన్నాట్ట. మన పోలీసుల తీరు కూడా అలాగే ఉంది. కొంచెం కూడా కామన్ సెన్స్ వాడటం లేదు. అసలు వారికి మెదడు ఉందో లేదో కూడా అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. దీంతో సహజంగానే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేనికి జరిమానా విధించాలో దేనికి తీసుకోకూడదో కూడా తెలియకుండా దద్దమ్మల్లా మిగిలిపోతున్నారు. తమ చేతిలో చట్టం ఉందనే అహంకారంతో కామన్ సెన్స్ ను కామన్ గా తీసుకుంటున్నారు. ఫలితంగా సామాజిక మాధ్యమాల్లో వారి తీరుకు విమర్శల పాలవుతున్నారు. కనీస తెలివి లేకుండా ప్రవర్తిస్తూ పిచ్చోడి చేతిలో రాయిలా మారుతున్నారు.

తాజాగా కేరళలోని మలపురంలోని నీలంచెరిలో సెప్టెంబర్ 6న కాలుష్య రహిత ఏథర్ 450 ఎక్స్ బైక్ కు జరిమానా విధించారు. పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం లేని ఎలక్ర్టిక్ బైక్ కు కూడా ఫైన్ విధించడం సంచలనం కలిగిస్తోంది. 1988లోని సెక్షన్ 213(5)(ఈ) నిబంధన ప్రకారం రూ.250 జరిమానా విధిస్తున్నట్లు చలానా జారీ చేయడంతో దాని యజమాని అవాక్కయ్యాడు. ఎలక్ర్టిక్ బైక్ లకు కూడా పొల్యూషన్ ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసుల తీరుకు నిర్ఘాంతపోయాడు. తన బైక్ కు జరిమానా విధించిన వారి తెలివికి ఆశ్చర్యపోయాడు.
విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొగ వదిలే బండ్లకే కాలుష్యం ఉంటుందని, ఎలక్ర్టిక్ వాహనాలు పొగ వదలకున్నా జరిమానా విధించడంలో ఔచిత్యమేమిటో అర్థం కావడం లేదు. వీరు చదువుకుని పోలీసు కొలువు చేస్తున్నారా? లేక అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన బాపతా అని అందరిలో అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి కేరళలో ట్రాఫిక్ పోలీసుల తీరుతో విమర్శలే వస్తున్నాయి. ఎలక్ర్టిక్ వాహనాలకు కూడా ఫైన్ విధించే మొనగాళ్ల జాబితాలో వీరు చేరిపోయారు. ఎవరికి సాధ్యం కాని పని వీరు అవలీలగా చేయడమే చర్చనీయాంశంగా మారింది.

నెటిజన్లు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు నడుచుకుంటూ వెళ్లే వ్యక్తికి కూడా జరిమానా విధించగల సమర్థులు అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. గతంలో ఓ సినిమాలో రవితేజ కారులో వ్యక్తికి కూడా హెల్మెట్ లేదని ఫైన్ వేయడంతో ప్రేక్షకులు సరదాగా నవ్వుకున్నారు. మరో సినిమాలో ఎంఎస్ నారాయణ బైక్ లు పార్కింగ్ చేసిన చోట నో పార్కింగ్ బోర్డు పెట్టి జరిమానాలు వసూలు చేసిన సన్నివేశాలు మనకు నవ్వును తెప్పిస్తాయి. ఇదే కోవలో కేరళ పోలీసులు చేసిన పనికి కూడా అందరు నవ్వుకుంటున్నారు. తామేదో మేధావులమని చెప్పుకునే పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం గమనార్హం.
Also Read:KCR PM Candidate: అప్పుడే కేసీఆర్ ప్రధాని.. అంతే తగ్గేదేలేదట.. నవ్వుతున్నారు స్వామీ?