https://oktelugu.com/

వైఎస్ షర్మిలకు ‘జల’ గండం..!

వైఎస్ షర్మిలా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెల్సిందే. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పార్టీ పేరును ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న షర్మిలా తెలంగాణ సమస్యలపై కొద్దిరోజులుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలను సంధిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ-ఆంధప్రదేశ్ మధ్య జల జగడంపై మొదలైంది. కృష్ణా జలాలను జగన్ సర్కార్ అక్రమంగా రాయలసీమకు తరలించుకు పోతుందనే ఆరోపణలు వస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ మంత్రులు స్పందిస్తూ […]

Written By:
  • NARESH
  • , Updated On : June 30, 2021 / 10:35 AM IST
    Follow us on

    వైఎస్ షర్మిలా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెల్సిందే. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పార్టీ పేరును ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్న షర్మిలా తెలంగాణ సమస్యలపై కొద్దిరోజులుగా స్పందిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలను సంధిస్తున్నారు.

    ప్రస్తుతం తెలంగాణ-ఆంధప్రదేశ్ మధ్య జల జగడంపై మొదలైంది. కృష్ణా జలాలను జగన్ సర్కార్ అక్రమంగా రాయలసీమకు తరలించుకు పోతుందనే ఆరోపణలు వస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ మంత్రులు స్పందిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

    వైఎస్ఆర్ నరరూప రాక్షసుడని.. జగన్ ఆయన్ని మించిపోయాడంటూ తెలంగాణ మంత్రులు నొటికొచ్చినట్లు మాట్లాడటం కన్పించింది. దీనిపై ఏపీ మంత్రులు మాత్రం తెలంగాణ నీటిని ఎత్తుకెళ్లడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఏపీకి రావాల్సిన వాటా కంటే ఒక్క చుక్క కూడా ఎక్కువ తీసుకెళ్లడం లేదని చెబుతున్నారు.

    తెలంగాణ, ఏపీ నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతున్న సమయంలో వైఎస్ షర్మిలా తన వైఖరిని ట్వీటర్ వేదికగా వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి కోసం అవసరమైతే పోరాటాలకు సిద్ధమని.. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకునేది లేదంటూ స్పష్టం చేశారు. షర్మిలా వ్యాఖ్యల నేపథయంలో జగన్ సర్కార్ నిజంగానే తెలంగాణ నీటి వాటాను దోచుకెళుతుందనే వాదనకు మరింత బలం చేకూరినట్లయింది.

    దివంతగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని.. ఏపీ సీఎం జగన్ ను టీఆర్ఎస్ మంత్రులు తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరిస్తున్న సమయంలోనే షర్మిలా వారి మాటలకు వత్తాసు పలికినట్లు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఏపీ-నీటి జలవివాదంపై ఎవరికీ వాదనలు కరెక్టే తేల్చాల్సిన పని కేంద్రంపై ఉంది. అయితే ఆంధ్రాకు చెందిన షర్మిలా తెలంగాణకు మద్దతుగా మాట్లాడటంతో జగన్ సర్కాన్ నీటిని అక్రమంగా తీసుకెళుతుందనే వాదనకు బలం చేకూరినట్లు కన్పిస్తుంది.

    తెలంగాణ సమస్యలను ప్రశ్నించకుండా వెనుకబడ్డానని షర్మిలా ఇలా స్పందించారా? లేదంటే నిజంగానే తెలంగాణ నీటిని ఏపీ దోచుకెళుతుందని కన్ఫామ్ చేసుకున్నారా? లేదా అని తేలాల్సి ఉంది. కృష్ణా నీటి విషయంలో రాజశేఖర్ రెడ్డిని దోపీడిదారుడి చిత్రీకరించిన టీఆర్ఎస్ కు మద్దతుగా షర్మిలా మాట్లాడాన్ని వైఎస్ఆర్ అభిమానులు ఏమేరకు స్వాగతిస్తారనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తెలంగాణ-ఏపీ జలవివాదం కాస్తా షర్మిలాకు గండంగా మారేలా కన్పిస్తున్నాయి.