https://oktelugu.com/

హలో ఇండియా టుడే.. జగన్ ఎక్కడా..?

దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మెహన్ రెడ్డి అంటూ.. అదే పనిగా.. పోల్స విడుదల చేసే ఇండియా టుడే.. ఈ సారి తన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరిచిపోయింది. తాజాగా ప్రకటించిన మూడ్ ఆఫ్ దినేషన్ పోల్ లో మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్ కేటగిరీలో టాప్ ఫైవ్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మెహన్ రెడ్డి పేరు లేదు. మొదటగా.. ఒడిశా సీఎం నవీన్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 25, 2021 2:38 pm
    Follow us on

    Mood Of The Nation Polls
    దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మెహన్ రెడ్డి అంటూ.. అదే పనిగా.. పోల్స విడుదల చేసే ఇండియా టుడే.. ఈ సారి తన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరిచిపోయింది. తాజాగా ప్రకటించిన మూడ్ ఆఫ్ దినేషన్ పోల్ లో మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్ కేటగిరీలో టాప్ ఫైవ్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మెహన్ రెడ్డి పేరు లేదు. మొదటగా.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పేరు ఉంది. తరువాత కేజ్రీవాల్, యోగీ ఆధిత్యానాథ్, ఉద్దవ్ థాకరే, తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్లు ఉన్నాయి. వీరే టాప్ ఫైవ్.

    Also Read: నిమ్మగడ్డకు ముద్రగడ లేఖ.. ఆ ఆదృశ్యశక్తి ఎవరు?

    ‘‘ మెస్ట్ పాపులర్ సీఎం‘‘ కేటగిరీలో రాష్ట్రాల వారీగా ఫలితాలను తీసుకుంటారు. అంటే ఒడిశా సీఎంకు 51శాతం ఆ రాష్ర్టం ప్రజల మద్దతు ఉందన్న మాట. ఇక ఢిల్లీ సీం కేజ్రీవాల్ కు 41శాతం , ఉత్తర ప్రదేశ్ సీం యోగీ ఆదిత్యనాథ్ కు39శాతం ప్రజలు, ఉద్దవ్ థాకరేకు 35శాతం మహారాష్ట్ర ప్రజలు, 30శాతం తెలంగాణ ప్రజలు సీఎంగా కేసీఆర్ పాలన బాగుందని మద్దతు తెలిపారు. అంటే మిగితా రాష్ర్టాలకు 35శాతం కన్నా తక్కువ ప్రజల మద్దతు ఉంది.అందులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మెహన్ రెడ్డి కూడా ఉన్నారన్న మాట.

    Also Read: ఇక చాలు.. రాజకీయాలకు మురళీమోహన్ గుడ్ బై..

    అదే విధంగా ఇండియా టుడే.. బెస్ట్ ఫర్ఫార్మింగ్ సీం పేరుతో ఓ పోల్ కూడా నిర్వహించింది. అందులో యోగీ ఆదిత్యనాథ్ మొదటి స్థానం సంపాదించారు. తరువాతి స్థానంలో కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ ఉన్నారు. ఈ పోల్ లో అభిప్రాయం వ్యక్తం చేసినవారు.. ఓటు వేసిన వారు.. ఆ రాష్ట్రానికి చెందిన వారై ఉండాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం మీద ఎక్కడి నుంచైనా.. అభిప్రాయాన్ని స్వీకరించి దాన్ని బట్టి రేటింగ్ ఇవ్వవచ్చు. ఇందులో మొత్తం వందశాతానికి 20శాతం మంది యోగీకి ఓటు వేశారు. 14శాతం మంది కేజ్రీవాల్ కు, 8శాతం మంది మమతా బెనర్జీకి, 6శాతం మంది నితీశ్ కుమార్ కు ఓటు వేశారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    తరువాత లిస్టులో జగన్, ఉద్దవ్ థాకరే, నవీన్ పట్నాయక్ కూడా ఉన్నారని ఇండియా టుడే చెబుతోంది. అయితే జగన్ కు ఆరుశాతం కన్నా.. తక్కువే.. ఓట్లు వచ్చాయని దీనిద్వారా అర్థం అవుతోంది. ఇండియా టుడే ఎప్పడు సర్వే ఫలితాలు ప్రకటించినా.. జగన్ మీడియా పెద్ద ఎత్తు ప్రకటించుకుంటుంది. కానీ ఈసారి సైలెంట్ అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి పేరు ఎక్కడా కనిపించకపోవడంతో ఆ సర్వే వివరాలే వివరించలేదు. నిజానికి జగన్ కు ఇండియా టుడే గ్రూపుకు మంచి సంబంధాలు ఉన్నాయి. కొన్ని కంట్రాక్టు ఒప్పందాలు కూడా వీరి మధ్య కొనసాగుతున్నాయి. అయితే ఈ సారి జగన్ పేరు సర్వేలో ఎందుకు మిస్సయ్యిందని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు..