జగన్ సర్కార్ కు షాక్.. ఏపీలో ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

నిమ్మగడ్డపై పోరులో ఏపీ సీఎం జగన్ ఓడిపోయారు. తాజాగా సుప్రీంకోర్టులో ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగింది. ఏపీ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.రాష్ట్రప్రభుత్వం తరుఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక […]

Written By: NARESH, Updated On : January 25, 2021 2:33 pm
Follow us on

నిమ్మగడ్డపై పోరులో ఏపీ సీఎం జగన్ ఓడిపోయారు. తాజాగా సుప్రీంకోర్టులో ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగింది. ఏపీ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.రాష్ట్రప్రభుత్వం తరుఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.

గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని.. కరోనా వ్యాక్సినేషన్ కోసం ప్రక్రియను వాయిదా వేయాలని సుప్రీంను కోరారు. పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నందున సాధ్యం కాదన్నారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి సైతం ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పునిచ్చారని తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమని ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.

అయితే ఎన్ని కారణాలు చూపినా దేశంలో చాలా అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని ఏపీలో నిర్వహణకు అడ్డంకి ఏముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఈ వాదనలు తోసిపుచ్చుతూ ఎన్నికలను నిర్వహించాలని తీర్పునిచ్చింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు ఎక్కిన ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పుతో చుక్కెదురైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ సీఎం జగన్ వార్ లో చివరకు నిమ్మగడ్డనే విజేతగా నిలిచాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సుప్రీంకోర్టు ఆదేశంతోనైనా జగన్ సర్కార్ ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి.