https://oktelugu.com/

ఓకే రోజు పవన్, మహేష్ కొత్త చిత్రాలు !

టాలీవుడ్ బిగ్ స్టార్స్ పవన్ కళ్యాణ్,మహేష్ బాబు ఇద్దరూ ఒకే రోజున కొత్త సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేయటంతో మెగా మరియు ఘట్టమనేని అభిమానులలో సందడి మొదలైంది. జనవరి 25 అనగా ఈ రోజు నుండి షూటింగ్ ప్రారంభించినట్లుగా మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన కొత్త సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయగా మహేశ్‌ బాబు సినిమా ‘సర్కారువారి పాట’ చిత్రీకరణను దుబాయ్‌లో ప్రారంభించారు. Also Read: విడుదల కాకుండానే మహేష్ సినిమా వరల్డ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 25, 2021 / 02:48 PM IST
    Follow us on


    టాలీవుడ్ బిగ్ స్టార్స్ పవన్ కళ్యాణ్,మహేష్ బాబు ఇద్దరూ ఒకే రోజున కొత్త సినిమాల షూటింగ్స్ స్టార్ట్ చేయటంతో మెగా మరియు ఘట్టమనేని అభిమానులలో సందడి మొదలైంది. జనవరి 25 అనగా ఈ రోజు నుండి షూటింగ్ ప్రారంభించినట్లుగా మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తన కొత్త సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయగా మహేశ్‌ బాబు సినిమా ‘సర్కారువారి పాట’ చిత్రీకరణను దుబాయ్‌లో ప్రారంభించారు.

    Also Read: విడుదల కాకుండానే మహేష్ సినిమా వరల్డ్ రికార్డ్

    రాజకీయం మాత్రమే చేస్తానన్న పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుని వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ పింక్ కు రీమేక్ గా వస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు పవన్. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తుంది. డైరెక్టర్ క్రిష్‌ సినిమా సెట్స్‌లో ఉండగానే పవన్‌ ఇదే ఊపులో సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న మరో చిత్రాన్ని ఈ రోజు పట్టాలెక్కించారు.

    Also Read: ‘సర్కారు వారి పాట’ మొదలైపోయింది !

    మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోశియమ్’‌ సినిమా రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దగ్గబాటి రానా, పవన్ ని డీ కొట్టే ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ వర్క్‌, మాటలను అందించటంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఇక సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్కారువారి పాట మూవీ అప్డేట్ ఈ రోజు వచ్చింది. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ రోజు నుండి దుబాయ్ లో ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ ప్రకటించారు. దర్శకుడు పరుశురాం ఈ షెడ్యూల్ లో మహేష్, కీర్తి సురేష్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఈ మూవీ నిర్మాణంలో మహేశ్ బాబు కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.