Jagan Mohan Reddy
Jagan Mohan Reddy : జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్డీఏ కూటమి విషయంలో తటస్థ వైఖరిని అనుసరిస్తున్నారు. అలాగని ఇండియా కూటమిని సమర్థించలేకపోతున్నారు. తనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇండియా కూటమి పక్షాల సాయం తీసుకుంటున్నారు. అదే ఇండియా కూటమి పక్షాలు ఆహ్వానిస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడ బిజెపికి కోపం వస్తుందోనన్న ఆందోళనలో ఆయన ఉంటున్నారు. జగన్ ఢిల్లీలో ఆందోళన చేస్తే ఇండియా కూటమి పక్షాలు వచ్చి మద్దతు తెలిపాయి. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశాయి. కానీ జగన్ మాత్రం ఇండియా కూటమికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించడానికి ధైర్యం చేయడం లేదు. పార్లమెంటులో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నడుచుకున్నారు. ఇప్పుడు స్టాలిన్ తో భేటీకి కూడా దూరంగా ఉంటున్నారు.
Also Read : సభకు వచ్చేందుకు సగం మందికి ఇష్టమే.. అడ్డుకుంటున్నది జగనే!
* అందరూ హాజరైన..
దేశంలో డీ లిమిటేషన్( D limitation ) ప్రక్రియకు నిరసనగా స్టాలిన్ చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల సమావేశాన్ని నిర్వహించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా చంద్రబాబుతో పాటు పవన్ కు ఆహ్వానం లేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఆహ్వానించారు. ఆయనతోపాటు దాయాది రాష్ట్రానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ నేత కేటీఆర్ కు ఆహ్వానం అందింది. వారు ఈ సమావేశానికి హాజరయ్యారు కూడా. కానీ ఇంతటి ప్రాధాన్యం గల సమావేశానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోవడం వెనుక కారణం కేసుల భయం. అనవసరంగా బిజెపికి వ్యతిరేకంగా వెళితే తనకు కలిగే నష్టం గురించి జగన్మోహన్ రెడ్డికి తెలుసు.
* అరుదైన అవకాశమే
దక్షిణాది రాష్ట్రాల్లో( South States) టిడిపి, జనసేనకు తప్పించి మిగతా రాజకీయ పక్షాలు అన్ని హాజరవుతున్నాయి. అయితే ఇటువంటి అరుదైన చాన్స్ వదులుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడే జగన్మోహన్ రెడ్డి.. దక్షిణాది రాష్ట్రాల గురించి మాట్లాడేందుకు వణికి పోతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం లేదు. తనకు మాత్రమే ఆహ్వానం అందడం నిజంగా ఆయన గొప్పతనం. కానీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి.
* కేసుల భయంతోనే..
బిజెపికి( Bhartiya Janata Party) వ్యతిరేకంగా వెళితే తనకు ఏ పరిస్థితి ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలియంది కాదు. ఒకసారి చంద్రబాబు ఆ తప్పుచేసి మూల్యం చెల్లించుకున్నారు. అసలే రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సమయంలో చిన్నపాటి తప్పు చేస్తే దానికి మూల్యం తప్పదు. అయితే ఈ భేటీకి జగన్ మోహన్ రెడ్డి గైర్ హాజరవ్వడం ద్వారా ఇండియా కూటమికి సైతం దూరమైనట్టే. ఏదో అనుకున్నాం కానీ.. జగన్మోహన్ రెడ్డి మరీ ఇంత భయస్తుడా? అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు. అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఆందోళన చేపట్టినా.. రాజకీయ ఇబ్బందులు పడినా.. పట్టించుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : జగన్ జీతం తీసుకోవడం లేదా?