టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కరోనా వైరస్ కంటే ప్రమాదమని వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ డేంజరస్ వైరస్ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులు, ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
జగన్ అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఏపీలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజా ఆందోళనలను నిర్వహించాలని.. టీడీపీ నేతలు పేద కుటుంబాలకు అండగా ఉండాలని సూచనలు చేశారు. జగన్ రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రగులుస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కట్టిన ఇళ్లు ఎప్పుడిస్తారో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.
జగన్ సర్కార్ డిపాజిట్ కట్టిన పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మోసం చేస్తోందని ఆరోపణలు చేశారు. పేద ప్రజల కష్టార్జితం డిపాజిట్ల రూపంలో చెల్లించి లాటరీలో ఇళ్లు పొందిందని అన్నారు. పేదలకు 2021 సంక్రాంతి పండుగ నాటికి ఇళ్ల స్థలాలను అప్పగించాలని సూచించారు. జగన్ పేరు మోసిన క్రిమినల్స్ తో కేసులు వేయిస్తున్నారని.. వైసీపీ మంచివాళ్లపై బురద జల్లుతోందని తెలిపారు.
Also Read: సమస్యల సుడిగుండంలో జగన్ సర్కార్
వైసీపీ నాయకులు మంచివాళ్ల విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఒకరు కేంద్రమంత్రి పేరుతో మోసాలు చేశారని.. అలాంటి వాళ్లతోనే కేసులు వేయిస్తున్నారని తెలిపారు. జగన్ క్రిమినల్స్ ద్వారా రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నాడని అన్నారు.