https://oktelugu.com/

దుబ్బాక ఎగ్జిట్ పోల్: ఎవరిది గెలుపంటే?

తెలంగాణలో అత్యంత ఉత్కంఠగా.. ఊపిరి బిగబట్టేలా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. ఓటర్లు విజేతలు ఎవరో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్లు పేర్కొంది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2020 / 08:32 PM IST
    Follow us on

    తెలంగాణలో అత్యంత ఉత్కంఠగా.. ఊపిరి బిగబట్టేలా సాగిన దుబ్బాక ఉప ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. ఓటర్లు విజేతలు ఎవరో ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన అనంతరం పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్లు పేర్కొంది. తర్వాత 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు రెండోస్థానం, కాంగ్రెస్‌కు 13 శాతం ఓట్లు రానున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది.

    Also Read: తెలంగాణలో దీపానికి బలైన 17 నెలల చిన్నారి.. ఏం జరిగిందంటే..?

    థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ విజయభేరీ గెలుస్తుందని అంచనా వేసింది. 51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం లభించగా.. 33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం వస్తుందని తెలిపింది. 8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానం లభించనున్నట్లు పేర్కొంది.

    *ఈనెల 10న తేలనున్న భవితవ్వం
    దుబ్బాక ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్‌ నుంచి సోలిపేట సుజాత పోటీ పడగా.. కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.. బీజేపీ నుంచి రఘునందన్‌రావు పోటీ చేశారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

    Also Read: దుబ్బాక: టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ అభ్యర్థి.. అది ఫేక్‌ న్యూస్‌ అంట..!

    కొన్ని తెలుగు న్యూస్ చానెల్స్ సైతం దుబ్బాకలో అభిప్రాయసేకరణ జరపగా బీజేపీ వైపే ప్రజలు మొగ్గినట్లు తేలింది.